ఓటమి బాధతో చంద్రబాబుకి…మతి పోయిందో.. లేకపోతే మత్తెక్కి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.

ఓటమి బాధతో చంద్రబాబుకి మందు అలవాటు.. ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
‘చంద్రబాబు ప్రేలాపనలు చూస్తుంటే.. మతి పోయిందో.. లేకపోతే మత్తెక్కి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. ఈ మధ్య అధికారం పోయిన తర్వాత ఏమైనా మద్యం అలవాటు అయ్యిందేమో తెలియదు కాని’
చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయామని, కుమారుడు లోకేష్ భవిష్యత్ ముగిసిందనే ఫ్రస్టేషన్‌లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్.
సీఎం జగన్ పాలనపై పిచ్చోడి చేతిలో రాయి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దారుణమని.. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎలా ఉంటుందో గత ఐదేళ్లలో చంద్రబాబు పాలనలో జనాలు స్వయంగా చూశారన్నారు. బాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఎవరెవరికి ఏమి దోచిపెడదామన్న ప్రయత్నాలే చేశారని విమర్శించారు.
చంద్రబాబుని చూసి వైఎస్సార్ భయపడ్డారని గొప్పలు చెప్పుకుంటున్నారని.. బాబు మరి ఇంత దిగజారుతారనుకోలేదన్నారు.

ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన తర్వాత చంద్రబాబు సొంతంగా అధికారంలోకి వచ్చిన సందర్భం ఒక్కటైనా ఉందా అన్నారు.
బాబులా పెయిడ్ ఆర్టిస్ట్‌లతో పబ్లిసిటీ చేయించుకున్న నేతలు ఎవరు లేరని.. చివరికి విశాఖ ఎయిర్ పోర్టులో జగన్‌పై హత్యాయత్నం జరిగితే..
వైఎస్సార్‌సీపీ నాయకులే చేయించారని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశారన్నారు.
ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్పుకొన్న ప్రాంతం నుంచి లోకేష్‌ను పోటీ చేయించారని.. అక్కడి ప్రజలు చెంప చెళ్లుమనిపించారన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే. తన కొడుక్కి భవిష్యత్ లేదని చంద్రబాబకు అర్థమయ్యిందని..
ఆ బాధతోనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుని కలవడానికి ఎవరైనా ఇష్టపడతారా.. ఆయనేమైనా అందగాడా.. శోభన్ బాబు అనుకుంటున్నారా అంటూ మంిడపడ్డారు.
విశాఖపై చంద్రబాబుది కపట ప్రేమని.. సాగర నగర బ్రాండ్ ఇమేజ్‌ను ఆయనే దెబ్బ తీశారన్నారు అమర్‌నాథ్.
వైఎస్ హయాంలో విశాఖ అభివృద్ధి జరిగిందని.. మళ్లీ జగన్ హయాంలో అభివృద్ధి జరగబోతుందన్నారు.
నాలుగు నెలల పాలనలో జగన్ ఎన్నో సంక్షేమ పథకాలతో.. దేశంలో ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు పద్దతి మార్చుకోవాలన్నారు.