దుర్మార్గపు తెలుగుదేశం … ఆపదలో నాయకులు… చంద్రబాబు తీరు

చంద్రబాబు గురించి ఈ తరం వారికి తెలియదు. ఇంత దుర్మార్గపు రాజకీయ నాయకుడు, ఇన్ని కుట్రలతో ఆయన రాజకీయ జీవితం ఉంది అనేది ఎవరికీ తెలియదు.
ఎన్‌టిఆర్ … 1982లో పార్టీ పెట్టగానే రంగులు వేసుకునే వాడికి వోట్లు ఎవరు వేస్తారు అన్నాడు… పార్టీ ఆదేశిస్తే ఎన్‌టిఆర్ మీద పోటీ అన్నాడు. ఎన్నికలు అయ్యాక 10 రోజులు గడవక ముందే వెళ్ళి పార్టీలో జేరాడు.
1995 వెన్నుపోటు సమయంలో ఎన్‌టిఆర్ కామాంధుడు అన్నారు. ఎన్‌టిఆర్ విలువలు లేని మనిషి అని ఇండియా టుడే ఇంటర్యూ లో చెప్పాడు. అదే సమయంలో మాకు ఎన్‌టిఆర్ అవసరం లేదు అన్నాడు. పార్టీ నుండి బహిష్కరించాడు. మళ్ళీ ఎన్‌టిఆర్ కి భారత రత్న కావాలి అని ఎన్నికల ముందు, ఆ రెండు రోజులు క్రమం తప్పకుండా అడుగుతాడు. అదే ఎన్‌టిఆర్ ని కనీసం అసంబ్లీ లో మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు.
1994 ఎన్నికల ముం లక్ష్మీ పార్వతితో రాజీ చేసుకున్నాడు. ఎన్నికలు అవ్వగానే ద్రోహి అన్నాడు.
పరిటాల రవి …. 1994 లో మొదటి సారి MLA. గెలవగానే ఎన్‌టిఆర్ కాబినెట్ లో మంత్రి అయ్యారు…
ఏమిటో అంత పెద్ద leader అయినా అన్నీ వందల వేల మంది కార్యకర్తలు విగ్రాహలు పెట్టినా చంద్రబాబు గారి వర్గంలో 1998 లో జేరినా మంత్రి పదవి ఇవ్వలేదు. 2004 లో తెలుగుదేశం ఓడిపోయాక ఆయన హత్య జరిగింది. అందులో కొందరి పాత్రలు పై అనుమానాలు అన్నారు…అదే JC ని టిడిపి లో జేర్చుకున్నారు.
నందమూరి బాలకృష్ణ … ఇంట్లో బెల్లంకొండ కాల్పులు… కాల్పులు జరిగితే వెళ్ళి పలకరించి రావాలా వద్దా అనేదాని మీద 4 రోజుల పాటు చర్చించి వెళ్ళి కనిపించారు. అదే చంద్రబాబు కొడుకుని బాలయ్య ఇవన్నీ పట్టించుకోకుండా లోకేశ్ కి పిల్ల నిచ్చారు…2009 లో గుర్తు కి రాని బాలయ్య 2014 నాటికి అవసరం అయ్యారు. కనీసం మంత్రి పదవికి అర్హుడు అవ్వలేదు. కానీ కొడుకుని MLC ని చేసి మంత్రి ని చేశారు.
నందమూరి హరికృష్ణ … 1995 లో వెన్నుపోటు సమయంలో ఎన్‌టిఆర్ కి మద్దతు ఎక్కడ ఇస్తాడో అని పార్టీ అధ్యక్ష పదవి + మంత్రి పదవి ఇస్తా అని
చెప్పి తన వైపు తిప్పుకున్నారు. అప్పట్లో మండలి లేదు కాబట్టి MLA ని చెయ్యాలి. కానీ చేయలేదు. 6 నెలల్లో చట్టసభకి ఎన్నికవ్వాలి . అలా అవ్వలేదు రాజీనామా చేశాడు. తరవాత 1996లో ఎన్‌టిఆర్ చనిపోవడం తో హిందూపురం నుండి గెలిచారు. అప్పుడు మంత్రి ని చేయలేదు. అధ్యక్ష పదవి ఇవ్వలేదు.
2013 లో సమైఖ్య ఆంధ్రా కోసం హరికృష్ణ MP గా రాజీనామా చేశారు. టిడిపి నుండి ఎంతో మంది రాజీనామా చేసిన ఎవరి రాజీనామా accept కాలేదు. కేవలం హరికృష్ణ ఒక్కడిడే రాజీనామా ని ఆమోదించారు. 2014 లో అధికారంలోకి వచ్చినా హరికృష్ణ కి ఎలాంటి పదవి ఇవ్వలేదు.
కృష్ణ యాదవ్ … మంత్రిగా ఉన్న కృష్ణ యాదవ్ stamps కుంభకోణం లో అరస్ట్ అయితే పలకరించలేదు. కానీ అదే కృష్ణ యాదవ్ ని 2013 లో పార్టీ లో జేర్చుకోవడానికి ఎదురు వెళ్లారు.
కోడెల 1999 ఎన్నికలలో బాంబుల కేసులో ఉంటే పదవి ఇవ్వలేదు కదా కనీసం పలకరించలేదు. అదే కోడెల ని తొక్కడానికి జిల్లాలో జూనియర్ అయిన వారిని మంత్రిగా చేసి ఎగదోశారు. ఇప్పటి విషయంలో టిడిపి నుండి కనీసం మద్దతు లేదు.
మరి 50 లక్షలు లంచం ఇస్తూ దొరికిపోయిన రేవంత్ ఎక్కడ తన పేరు చెబుతాడో అని రేవంత్ ఇంటికి ఒక వేడుకకి కుటుంభం మొత్తం వెళ్లింది. ఎందుకు అనేది ఆలోచించ వచ్చు .
2019 ఎన్నికల కి 6 నెలల ముందు కాబినెట్ విస్తరణ అయింది. కీడారి శ్రావణ్ కుమార్ ని మంత్రిని చేశారు 6 నెలల్లో ఎన్నికలు లేవని తెలసి కూడా మంత్రిని చేశారు. MLC కాలీలు వస్తే వేరే వారికి ఇచ్చారు గాని ఈ గిరిజన నాయకుడి కొడుక్కి ఇవ్వలేదు.
MLC ఎన్నికలు కుట్ర కోణం … 2019 ఎన్నికలలో పోటీ చేస్తుంటే సోమి రెడ్డి & రామ సుబ్బ రెడ్డి మాత్రం MLC పదవులకి రాజీనామా చెయ్యాలి. కానీ తన సొంత కులం వారు అయిన కరణం , పయ్యావుల, నారా లోకేశ్ మాత్రం రాజీనామా చేయకుండా పోటీ చేశారు.
కేశినేని నాని లాంటి ఆయన పార్టీ కోసం PRP లో కోవర్ట్ ఆపరేషన్ బాబు గారి కోసం చేశాడు. 2014 నుండి 2019 మధ్యలో అనేక ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాదయాత్ర కర్చు & మునిసిపల్ ఎన్నికల కర్చు ఆయనే చూసుకున్నారు. అప్పుడు గాని ఇప్పుడు గాని ఆయనని పట్టించుకోరు.
అలానే వాకాటి నారాయణ రెడ్డి & దీపక్ రెడ్డి ల మీద ఆరోపణలు రాగానే పార్టీ నుండి సస్పెండ్ అన్నారు. మరి సుజనా , కోడెల లాంటి సొంత కులం వారి మీద నోరు మెదపరు.
జేఆర్ పుష్పరాజ్, వర్ల రామయ్య, మోత్కుపల్లి , వడ్డే , మల్లెల బాబ్జీ ఇలా చెప్పుకుంటా వెళితే కొన్ని లక్షల real examples చెప్పవచ్చు.
ఇది చంద్రంద్రబాబు దుర్మార్గపు రాజకీయం … ఇలాంటి నాయకుడు పార్టీ కి అవసరమా ?
ఈ రోజు కోడెల కి మద్దతు ఇవ్వరు.. మరి ఇంత నిజాయితీగా ఉండే తెలుగుదేశం అధ్యక్షుడు , visonary , administrator , శాంతి భద్రతలనీ ఉక్కు పాదం తో తొక్క గలిగిన చంద్రబాబు కి అప్పుడు కోడెల చేసిన దుర్మార్గాలు కనపడలేదా ?
ఇలాంటి నాయకుడుని నమ్మితే ఏ తెలుగుదేశం కార్యకర్త కి న్యాయం జరగదు. మేలుకోండి.