సంక్రాంతి కానుకగా పేద వృద్ధులకు రెట్టింపు చేసిన పెన్షన్లు చంద్రబాబు

CM Chandrababu to Announce MLA Candidates List for AP

CM Chandrababu to Announce MLA Candidates List for AP

ఏపీ ప్రభుత్వం ఎన్నికల వేళ సంక్రాంతికి ముందు పండుగ కానుకను ప్రకటించింది, ఇప్పటివరకు పేద వృద్ధులకు ఇచ్చే వెయ్యి రూపాయల పెన్షన్ ను 2000 రూపాయలు చేస్తున్నట్లు ప్రకటించింది, పెంచిన పెన్షన్లను ఈ జనవరి నుండి అందిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు, ప్రస్తుతం రాష్ట్రంలో పెన్షన్లు చెల్లింపు కోసం 550 కోట్లతో ఖర్చు చేస్తుండగా పెరిగిన పెన్షన్లకు 1100 కోట్లు చెల్లించాలి, ఇక వీటితో పాటు మొత్తం పదకొండు రోజుల జన్మభూమి కార్యక్రమాలలో ఆరున్నర లక్షల పెన్షన్ దరఖాస్తులు అందాయి, వీటితో సుమారు 4 లక్షల ఫంక్షన్లు ప్రతి నెల నుండి ఏపీ ప్రభుత్వం చెల్లించాలి కాగా 2014 కు ముందు కేవలం 200 రూపాయలు మాత్రమే చెల్లించేవారు, చంద్రబాబు ఎన్నికల హామీ ఇవ్వడం వెయ్యి రూపాయలు పెంచగా ఇప్పుడు ఎన్నికలకు ముందే పండుగ కానుకగా రెట్టింపు చేశారు, ప్రజల కొరకు పాటుపడుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు కితాబిచ్చారు, పేద బడుగు బలహీన వర్గాలకు చేయూతనిస్తూ అనేక సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదుకుంటామని చెప్పారు, ఈ రెండు వేల పెన్షన్ ఎంతో మందికి ఉపయోగపడుతుందని తెలియజేశారు, ఎంత బాధ అయినా పర్వాలేదు నాకు కావలసింది పేదలు అందుకే ఆలోచించా, గత ఎన్నికల సమయంలో ఇంటికి పెద్ద కొడుకు మాదిరి ఉంటానని హామీ ఇచ్చి అందుకే పెన్షన్ మొత్తాన్ని పెంచి ఇంకా ఎంతో చేయాలని ఉన్న సంపద సృష్టించి ఆదాయం పెంచి మళ్లీ మీకు పెంచుతాం, ప్రజల సంతోషమే నా సంతోషం అన్న చంద్రబాబు, ఏ ప్రభుత్వమైనా ప్రజల నమ్మకం పైనే మనుగడ సాగిస్తుందన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *