నేనేంటో తెలియాలంటే ‘మహానాయకుడు’ సినిమా చూడండి: చంద్రబాబు

1.నేనేంటో తెలియాలంటే ‘మహానాయకుడు’ సినిమా చూడండి: చంద్రబాబు
భయపెడుతున్నారు.

2.నేను భయపడతానా తమ్ముళ్లూ. భయం నాకు తెలుసా ఎప్పుడైనా?

3.24 బాంబులేశారు నాపైన. అప్పుడే నేను భయపడలేదు.

4.ఈ తాటాకు చప్పుళ్లకు నేను భయపడతానా తమ్ముళ్లూ: చంద్రబాబు నాయుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తానేంటో తెలియాలంటే ‘యన్.టి.ఆర్. మహానాయకుడు’ సినిమా చూడాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. శనివారం కర్నూలు జిల్లా కోడుమూరు బహిరంగసభలో మాట్లాడిన సీఎం..

ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. తాటాకు చప్పుళ్లకు తాను భయపడబోనని హెచ్చరించారు.

‘నరేంద్ర మోదీ నిన్న విశాఖపట్నం వచ్చారు. రైల్వే జోన్‌ను ప్రకటించారు. వాల్తేరు డివిజన్‌ను రాయగడకు ఇచ్చి ఆదాయంలేని జోన్‌ను మనకిచ్చారు. ఇదేంటని ప్రశ్నిస్తే మనపై దాడి చేస్తున్నారు.

మీ దాడికి నేను భయపడను గుర్తుపెట్టుకోండని నరేంద్ర మోదీని హెచ్చరిస్తున్నా. మన దగ్గర ఒక పార్టీ ఉంది.. కోడికత్తి పార్టీ. ఆ పార్టీ విశాఖపట్నం జోన్ గురించి మాట్లాడదు.

కడపలో ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడదు. మనకు అన్యాయం చేసిన నరేంద్ర మోదీ విశాఖ గడ్డపై కాలుపెడితే ఆయన్ని నిలదీయదు.

నాకు వ్యక్తిగత వైమనస్యాలు లేవు. మీకు అన్యాయం చేస్తే వారు ఎవరైనా సరే గుండెల్లో నిద్రపోతాను తప్ప వదిలిపెట్టను’ అంటూ చంద్రబాబు ఆగ్రహంగా మాట్లాడారు.

‘భయపెడుతున్నారు. నేను భయపడతానా తమ్ముళ్లూ. భయం నాకు తెలుసా ఎప్పుడైనా? 24 బాంబులేశారు నాపైన. అప్పుడే నేను భయపడలేదు. ఈ తాటాకు చప్పుళ్లకు నేను భయపడతానా తమ్ముళ్లూ’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

1982-84లోనే తెలుగుదేశం పార్టీ శక్తి ఏంటో చూపించామని, ఆ నాడు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడి న్యాయాన్ని దక్కించుకున్న ఘనత టీడీపీదని చంద్రబాబు గుర్తుచేశారు. కేంద్రం అన్యాయం చేసినప్పుడు ప్రజల కోసం తిరుగుబాటు చేస్తాం, పోరాడతాం, చైతన్య తీసుకొస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *