చంద్రబాబు మన సీఎం అవ్వడం మన కర్మ అంటున్న: వైఎస్ జగన్

రాబోతున్న ఎలక్షన్స్ దృశ్యి ఆంధ్రప్రదేశ లో తెలుగుదేశం ప్రభుత్వం సీక్రెట్ సర్వే నిర్వహిస్తుందని తెలిపారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సర్వే ద్వారా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయ దలచుకోలేదు వారి యొక్క ఓటర్ల జాబితాను ఓటర్ ల లిస్ట్ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు వైఎస్ జగన్.

ఈ విషయాన్ని గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేయగా తాము నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ జరగాలని కోరుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించలేదని తెలిపారు.

చంద్రబాబు నాయుడు చేసే దీక్ష ఢిల్లీలో ఫిబ్రవరి 11న ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ జరగబోతుందని ఈ రీత్యా వైయస్ జగన్ స్పందిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ మనకు చంద్రబాబునాయుడు సీఎం అవ్వటమే నాని అని తెలిపారు.

ఓ వ్యక్తిని మరొకరిని కత్తితో పొడిచి తిరిగి ఆ హత్యకు నిరసనగా దీక్ష ఎలా ఉంటుందో చంద్రబాబు దీక్ష కూడా అలాగే ఉందని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని తెలిపారు. హోదా సంజీవని కాదని అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తీరును ఎవరూ మరిచిపోలేదు అన్నారు.

హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన అరుణ్ జైట్లీకి ధన్యవాదాలు తెలుపుతూ శాసనసభలో తీర్మానం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తున్న దృశ్య దొంగ దీక్షలు చేపడుతున్నారని జగన్ మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *