జాగ్రత్త జగన్:వైకాపా ఎమ్మెల్యేలు కాస్త చేతివాటం చూపిస్తున్నారనే కామెంట్లు మొదలైపోయాయి..

తాను అధికారం చేపట్టినప్పటినుంచీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఒకదానితర్వాత ఒకటిగా చేసుకుంటూ అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని చక్కబెట్టుకుంటూ వస్తున్నారు జగన్.

అయితే గతకొంతకాలంగా కాన్సంట్రేషన్ మొత్తం ప్రభుత్వంపైనా సంక్షేమ పథకాలపైనా మాత్రమే పెట్టడంతో… వైకాపా ఎమ్మెల్యేలు కాస్త చేతివాటం చూపిస్తున్నారనే కామెంట్లు మొదలైపోయాయి. అందులో భాగంగా ఒక భారీ స్కాం వెలుగులోకి వచ్చింది!!

నిన్నమొన్నటివరకూ పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో ప్రభుత్వం సొమ్ము వైకాపా ఎమ్మెల్యేల పాలయ్యిందనే వార్తలు కోకొల్లలుగా వచ్చిన సంగతి తెలిసిందే. వాటిపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే సంగతి కాసేపు పక్కనపెడితే… ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే విద్యుత్ సబ్ స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి సంబందించి దాదాపు 12000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయిన సంగతి తెలిసిందే.

ఈ విషయంలో ప్రస్తుతానికి కాంట్రక్ట్ బేసే అయినా.. త్వరలోనే పర్మినెంట్ అయిపోతుందని చెబుతూ ఒక్కో పోస్టుకూ సుమారు పదిలక్షల రూపాయల చొప్పున స్థానిక ఎమ్మెల్యేలు కలెక్ట్ చేశారనే వార్త వెలుగులోకి వచ్చింది. దాంతో జగన్ వెంటనే ఆ నోటిఫికేషన్ ను రద్దు చేశారు! దీంతో.. ఇప్పటికే పదేసి లక్షల చొప్పున చెల్లించుకున్న నిరుద్యోగులు స్థానిక ఎమ్మెల్యేల పై ఒత్తిడి తేవడం మొదలెట్టారు! మరి ఈ ఒత్తిడి మరీ పెరిగిపోతుందో ఏమో కానీ… జగన్ సీఎంగా ఉన్నారన్న విషయం మరిచిన కొందరు నేతలు దూకుడు ప్రదర్శించారంట.

ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న ఒక 15మంది వరకూ ఉద్యోగులను ఊడబీకి మరీ… ఈ పదిలక్షలు ఇచ్చిన బ్యాచ్ కు ఉద్యోగాలు ఇప్పించేశారంట. దీంతో వ్యవహారం సీరియస్ అయ్యిందని అంటున్నారు. ఈ స్కాంలో సుమారు రూ.200కోట్లవరకూ అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో జగన్ తదుపరి చర్యలు ఏమిటనేదానిపై ఉత్కంఠ నెలకొంది!

ఆ సంగతులు అలా ఉంటే… ఈ కక్కుర్తి కార్యక్రమం ద్వారా.. “వారు అమ్ముకున్నవి ఉద్యోగాలు మాత్రమే కాదని… జగన్ వారిపై పెట్టుకున్న నమ్మకంతో పాటు.. జగన్ పై వారు పెట్టుకున్న నమ్మకాన్ని కూడా” అనే మాటలు ఆన్ లైన్ వేదికగా మొదలైపోయాయి!! వీరిపై కూడా కాస్త దృష్టి సారించు జగన్ … జాగ్రత్త సుమా! మీరు పడుతున్న కష్టం అంతా.. ఇలాంటి ఎమ్మెల్యేల కక్కుర్తి పనులవల్ల వల్ల బూడిదలో పోసిన పన్నీరు అయ్యే ప్రమాధం ఉందని హెచ్చరిస్తున్నారు ఫ్యాన్స్!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *