కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో…రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈసారి రెండు రోజులే జరగనున్నట్లు తెలుస్తోంది

అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులే.. తొలి రోజే బడ్జెట్!
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈసారి రెండు రోజులే జరగనున్నట్లు తెలుస్తోంది.
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు భిన్నంగా జరగనున్నాయి.
మంగళవారం (ఈ నెల 16) రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
అయితే ఈసారి ఉభయ సభల సమావేశాలను కేవలం రెండు రోజులకే కుదించబోతున్నట్ల తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మంగళవారం మొదటి రోజు గవర్నర్ ప్రసంగం, అదేరోజు ధన్యవాద తీర్మానం ఉంటాయని తెలుస్తోంది. అలాగే రాష్ట్ర బడ్జెట్‌ను కూడా అదే రోజు ప్రవేశపెడతారని సమాచారం.
అదే రోజు బడ్జెట్‌కు సభ ఆమోదం తెలిపి.. మరుసటి రోజు కొన్ని బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఆ బిల్లుల ఆమోదం తర్వాత శాసనసభ సమావేశాలను వాయిదా వేయనున్నట్లు సమాచారం.
కాగా, కరోనా వైరస్ రోజురోజుకీ పెరుగుతున్న సమయంలో ప్రభుత్వం పక్కా నివారణ చర్యలు చేపడుతోంది.
ఇందులో భాగంగా అసెంబ్లీకి హాజరయ్యే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జాగ్రత్త చర్యలను సూచిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి రాష్ట్ర లెజిస్లేచర్ కార్యదర్శికి ప్రత్యేక నోట్ పంపించగా లెజిస్లేచర్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు పలు కీలక సూచనలు చేశారు.