వైఎస్ వివేకా హత్య కేసు విచారణకు బ్రేక్.. ఢిల్లీ వెళ్లిన సీబీఐ అధికారులు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై విచారణను సీబీఐ అధికారులు తాత్కాలికంగా విరామం ఇచ్చారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ (సీబీఐ) తాత్కాలికంగా బ్రేక్ వేసింది.

రెండు వారాల పాటు ప్రాథమికంగా విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు కడప, పులివెందులలో విచారణ జరిపారు.

వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శివశంకర్‌ రెడ్డి, పీఏ కృష్ణా రెడ్డి తదితరులను విచారించారు.

ఇంకా పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారించనున్నారు.

ఈ తరుణంలో తాత్కాలిక విరామం తీసుకుని సీబీఐ బృందం కడప నుంచి ఢిల్లీ వెళ్లింది. తొలుత 10 రోజుల పాటు పులివెందుల వెళ్లి ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు..

వివేకా ఇంట్లో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. సిట్‌ దర్యాప్తు నివేదికను పులివెందుల పోలీసులు సీబీఐకి అప్పగించారు.

అలాగే కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో వివేకా కుమార్తె సునీత సమక్షంలో వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, పనిమనిషి లక్ష్మీదేవి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయ్‌ తుల్లాను అధికారులు విచారించారు.

కాగా, 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా 25 రోజుల ముందు వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయన్ను కిరాతకంగా హతమార్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed