బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన చంద్రబాబు*

శాసనసభ వేదికగా శుక్రవారం .బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు .

రాష్ట్రానికి చెప్పినదానికంటే కేంద్రం ఎక్కువే చేసిందని చెప్పగానే. సీఎం తీవ్రంగా స్పందించారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయం ఏంటో, చెప్పాలని విష్ణుకుమార్ రాజు ను నిలదీశారు.

సభలో చంద్రబాబు తీవ్ర స్వరంతో మాట్లాడటం ప్రారంభించారు. సీఎం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.

కేంద్రం ఎవరి కోసం నిధులు ఇస్తుంది. ఎవడబ్బ సొమ్ము అనుకుంటున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారా. సాధారణ పౌరుడికి ఉండే ఆసక్తి కూడా మీలో లేదు.

ప్రజా ప్రతినిధిగా ఉండే అర్హత మీకు లేదు. రక్తం పొంగుతోంది.

రాష్ట్రంలో ఎవరికీ ఊడిగం చేస్తారు. అడిగేవాళ్లు లేరనుకుంటున్నారు మమ్మల్ని ఏం చేస్తారు. జైల్లో పెడతారా తమాషాలు చెస్తున్నారు.

కొత్త రాష్ట్రానికి సహకరించాల్సిదిపోయి సిగ్గు విడిచి మాట్లాడుతున్నారు. బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ సెక్యులరిజం వదల్లేదు.

బలం లేకపోయినా 2014 శాసనసభ ఎన్నికల్లో 14 సీట్లు ఇచ్చే సహకరించా., నాలుగే గెలిచారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు బిజెపి ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు ,మాణిక్యాలరావు ల మధ్య ఆగ్రహావేశాల తోపాటు ఆసక్తికర సంభాషణ చోటుచేసుకున్నాయి.

వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులు మళ్లీ వెనక్కి తీసుకోవడం ముఖ్యమంత్రి తప్పు పట్టారు. మళ్లీ పంపాలని ప్రధానికి లేఖ రాస్తే ఇప్పటికీ స్పందన లేదు.

విష్ణుకుమార్ రాజు రాయబారం చేస్తామంటున్నారు. అసలు ఎందుకు వెనక్కి తీసుకున్నారు.

రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి మోడీ ఎవరు. విష్ణుకుమార్ రాజు గారు రాష్ట్ర ప్రజల్లో మీరు ఒకరు. అంటే మీరు బాధితులే. దీనిపై ప్రధాని నిప్రశ్నించండి.విశాఖ రైల్వే జోన్ ఇచ్చి ప్రధానిని విశాఖ కు రమ్మనండి.

కేంద్రం చేయాల్సికేంద్రం చేయాల్సిన సాయం కోసం మళ్లీ మీకు ఏం లెటర్ కావాలి. ప్రజలు మిమ్మల్ని ఉతికి ఆరేస్తారు ఏమనుకుంటున్నారు. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ పసుపు రంగు పవిత్రతను దెబ్బతీసేలా నల్ల చోక్కలు ధరించారు. మాకు మిత్ర ద్రోహం చేశారు.

జనసేన పవన్ కు ప్రేమ బాణాలు వదులుతున్నారు. విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ 23 మంది ఎమ్మెల్యేల. రాజీనామాలు ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు.

మాకు రోషoఉంది ,కానీ రాజకీయ రోషoలేదు అని మాజీ మంత్రి బీజేపీ సభ్యుడు మాణిక్యాల రావు అన్నారు. అయినా రాష్ట్ర అభివృద్ధి కేంద్రం సహకరిస్తున్న ఉందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *