బాబుపై ముప్పేట దాడికి బీజేపీ సిద్ధం*

పచ్చమీడియాను అడ్డం పెట్టుకొని అబద్దాలు ప్రచారం చేస్తూ తన వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వంపై రుద్దుతూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై ముప్పేట దాడికి బీజేపీ నేతలు సిద్ధం అవుతున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆ పార్టీ జాతీయ నాయకులూ చంద్రబాబుపై ముప్పేట దాడికి రంగం సిద్ధం చేశారు.

ఫిబ్రవరి నెలలో రాష్ట్రంలో బీజేపీ ముప్పేట దాడికి సిద్ధం అయ్యింది. అమిత్ షా మూడుసార్లు, నరేంద్ర మోడీ రెండుసార్లు, మిగిలిన కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ నాయకులూ చంద్రబాబుపై ఎదురుదాడికి సిద్ధం అయ్యారు.

పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని చంద్రబాబు చెప్పే ప్రతి అబద్దాన్ని లెక్కలతో సహా తేల్చేందుకు బీజేపీ నేతలు సమాయత్తం అవుతున్నారు. అమిత్ షా ఫిబ్రవరి 4న విజయనగరంలో బహిరంగ సభకు హాజరవుతున్నారు.

ఆ తర్వాత అయన ఫిబ్రవరి 21న రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 26న ఒంగోలు నగరాల్లో బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.

అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 10న గుంటూరులో, ఫిబ్రవరి 16న విశాఖపట్నంలో బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.

ఫిబ్రవరి 4న బీజేపీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్రంలో బస్సు యాత్ర ప్రారంభిస్తుంది. శ్రీకాకుళం జిల్లా పలాసలో మొదలయ్యే ఈ బస్సు యాత్ర కర్నూల్ జిల్లా ఆదోనిలో ముగుస్తుంది.

ఈ యాత్ర క్రమంలో పలు నగరాల్లో బీజేపీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది

ప్రతి బహిరంగ సభలోనూ ఒకరిద్దరు కేంద్ర మంత్రులు, నాలుగురో, ఐదుగురో పార్టీ జాతీయ నాయకులూ పాల్గొని ప్రసంగించనున్నారు.

ప్రతి కేంద్ర మంత్రి తన మంత్రిత్వ శాఖ ద్వారా ఈ నాలుగున్నరేళ్ళలో రాష్ట్రానికి అందిన నిధుల వివరాలు వెల్లడి చేస్తారు.

ఆపైన ఆ నిధులు చంద్రబాబు చేతిలో ఎలా దుర్వినియోగం బీజేపీ రాష్ట్ర నాయకులూ, జాతీయ నాయకులూ ప్రజలకు వివరించనున్నారు.

బీజేపీ తలపెట్టిన ఈ ముప్పేట దాడికి సంబంధిబంచిన సమాచారం ఉండడం వల్లే చంద్రబాబుకు హఠాత్తుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కాకుండా ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని గుర్తొచ్చింది.

బీజేపీ దాడి నుండి తనను తాను కాపాడుకోడానికి ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను అడ్డం పెట్టుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.

అందులో భాగంగానే ఫిబ్రవరి 11న దేశరాజధాని ఢిల్లీలో ఒక్కరోజు దీక్ష చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.

దీక్ష సమయంలో తనచుట్టూ వలయంగా నిలబడి తనను కాపాడేందుకు బీజేపీయేతర పార్టీల నాయకులకోసం చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్ళలో కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖలనుండి వేలకోట్ల రూపాయలు తెచ్చుకుంది.

అయితే ఏఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానికి చెందినదిగా చంద్రబాబు చెప్పలేదు.

గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, మంచినీటి పధకాలు, గృహ నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఎల్ ఈడీ విద్యుత్ దీపాలు, పెన్షల్ను, ఇలాంటివన్నీ కేంద్రం నిధులతోనే అయినా చంద్రబాబు బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి ఇసుమంత క్రెడిట్ ఇవ్వకపోవటం ఇప్పుడు బీజేపీ నేతల ఆగ్రహానికి గురైంది.

అందుకే చంద్రబాబు బొక్కలు బయట పెట్టేందుకు బీజేపీ నేతలు పూర్తి లెక్కలతో వస్తున్నారు.

రాష్ట్రంలో చంద్రబాబు అమలు చేస్తున్న దాదాపు అన్ని పథకాలూ కేంద్రం నిధులతో అమలయ్యేవే.

అందుకే బీజేపీ జాతీయ నాయకత్వం చంద్రబాబు ఆడుతున్న “సొమ్మొకరిది సోకొకరిది” సినిమా బండారం బయటపెట్టబోతున్నారు.

బీజేపీ నాయకత్వం ఎంత ప్రయత్నం చేసిన రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేదు.

అయినా బీజేపీ చేయనయున్న ఈ ముప్పేట దాడి చంద్రబాబు అసలు రంగు ప్రజలకు తెలియజెప్పడంలో విజయం సాధిస్తుంది.

చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ వీధుల్లో బట్టలూడదీసి నగ్నంగా నిలబెట్టే ప్రయత్నంలో బీజేపీ నేతలు విజయవంతం అవుతారు.

ప్రజలకు చంద్రబాబు మచ్చలు కనిపించడానికి బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నారు.

రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాల దృష్ట్యా ఇది మంచి పరిణామం. ప్రజలు ఆహ్వానించదగ్గ పరిణామం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *