బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది…

బీజేపీ నేత బద్దం బాల్ రెడ్డి ఆరోగ్యం విషమం.

బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది.

గత కొంత కాలంగా కేన్సర్‌తో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యం విషమించినట్లు కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

బీజేపీ సీనియర్‌ నేత బద్దం బాల్‌రెడ్డి (72) ఆరోగ్యం విషమించింది. గత కొంత కాలంగా బంజారా హిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి శనివారం (ఫిబ్రవరి 23) మధ్యాహ్నం మరింత విషమించినట్లు వైద్యులు తెలిపారు.

కేన్సర్‌తో బాధ పడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఫిబ్రవరి 10న బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు.

బద్దం బాల్ ‌రెడ్డి ఆరోగ్యం విషమించిందనే వార్తతో బీజేపీ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌ తదితర నేతలు కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు.

ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

బీజేపీలో సాధారణ స్థాయి నుంచి రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నేతగా ఎదిగిన బద్దం బాల్‌రెడ్డి..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1985 నుంచి 1994 వరకు కార్వాన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

తెలంగాణ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి బీజేపీ తరుఫున ఆయన పోటీ చేసి పరాజయం పాలయ్యారు.

కార్వాన్‌ నియోజకవర్గంలో ఆది నుంచి ఎంఐఎం ప్రభావం ఎక్కువ. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ఆ నియోజక వర్గం నుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థిగా బద్దం బాల్ రెడ్డి రికార్డు సృష్టించారు.

హైదరాబాద్ పాతబస్తీలో బీజేపీ ప్రాబల్యం పెంచిన వారిలో బాల్ రెడ్డి ఒకరు. ఈ నేపథ్యంలో అభిమానులు ఆయణ్ని ‘గోల్కొండ సింహం’గా పిలుచుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed