అతిపెద్ద సర్వే… వైఎస్ఆర్సిపి కి అద్భుతమైన విజయం…

దేశంలోని అతిపెద్ద సర్వే ఏకంగా నాలుగు లక్షల 37 వేల 642 శాంపిల్స్ను తీసుకున్నారు. వివిధ రంగాల ప్రజలను కూలంకుషంగా సుదీర్ఘంగా అధ్యయనం చేసింది. సెంటర్ ఫర్ సర్ సేఫాజీస్ స్టడీస్ ఈ అధ్యయనంలో వైసిపి క్లీన్స్వీప్ తధ్యమని తేల్చిపారేసింది. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 21వ తేదీ ఈ అధ్యయనంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేస్తుందని తేలింది.
దీని అంచనా ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 172 ఎమ్మెల్యే సీట్లు దక్కే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ 53 ఎమ్మెల్యే సీట్లకు పరిమితం అవుతుందని ఈ సర్వే అంచనా వేసింది. జనసేన ఒక్క సీటును కూడా గెలవలేదని ఈ సర్వే అంచనా వేయడం విశేషం. అలాగే కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు కానీ ఇతర ఏ పార్టీలు కానీ ఎమ్మెల్యేలుగా నెగ్గే అవకాశాలు లేవని సర్వే తేల్చేసింది.
సమాజంలోని వివిధ విభిన్న వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకుని ఈ అధ్యాయాన్ని చేపట్టినట్లు సీపీఎస్ ప్రకటించింది. 25 శాతం మంది కార్మికులు, 21 శాతం రైతులు, 20 శాతం వ్యాపారస్తులు అభిప్రాయాలు, ఏడు శాతం గృహిణులు, ఏడు శాతం ప్రభుత్వ ఉద్యోగులు, ఆరు శాతం విద్యార్థులు, నాలుగు శాతం నిరుద్యోగుల నుంచి ఇతరుల నుంచి మిగతా శాతాల అభిప్రాయాలు తీసుకుని ఈ సర్వే ని తీసుకున్నట్లు చెప్పారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత గణనీయంగా ఉందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. ఏకంగా 50.4. % ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తం చేశారని 47 శాతం సానుకూలంగా ఉన్నారని అధ్యయనం పేర్కొంది.
ఓట్ల శాతం నంబర్లు :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ –47.8
టీడీపీ-43.3
జనసేన-4.6
బీజేపీ-1.9
కాంగ్రెస్-1.7
సీపీఐ-0.3
సీపీఎం-0.2
ఇతరులు-0.2
సీట్ల నంబర్లు :
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -122
తెలుగుదేశం పార్టీ -53
జనసేన- 00
కాంగ్రెస్-00 బీజేపీ-00 ఇతరులు-00