ఈఎస్ఐ స్కీమ్ లబ్ధిదారులకు ప్రయోజనం కేంద్ర కీలక నిర్ణయం.. మెటర్నిటీ ఖర్చుల పెంపు..మోదీ శుభవార్త..

తక్కువ జీతం ఉన్న వారికి మోదీ శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం!

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈఎస్ఐ స్కీమ్‌లో ఉన్న వారికి ఊటర కలిగేలా, మెటర్నిటీ ఖర్చులను పెంచుతామని పేర్కొంది. దీనికి సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈఎస్ఐ స్కీమ్‌లో చేరిన వారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వం తాజాగా వీరికి తీపికబురు అందించింది. మెటర్నిటీ ఖర్చులను పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో స్కీమ్‌లో చేరిన వ్యక్తి భార్యలకు ప్రసూతి ఖర్చుల కింద రూ.7,500 అందజేస్తారు. ప్రస్తుతం వీరికి రూ.5,000 ఇస్తున్నారు.

కార్మిక మంత్రిత్వ శాఖ మెటర్నిటీ ఖర్చులను పెంచే నిర్ణయానికి సంబంధించి ఒక ముసాయిదాను విడుదల చేసింది.

డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారం.. మెటర్నిటీ వ్యయాల పెంపునకు సంబంధించి ప్రజలు వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలిజేయవచ్చు. 30 రోజుల్లోగా సూచనలు, సలహాలు తెలియజేయాలి.

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఈఎస్ఐ స్కీమ్‌ను అందిస్తున్న విషయం తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్‌ రూల్స్ 1950లోని రూల్ 56ఏను సవరిస్తోంది.

అయితే ఈఎస్ఐ హాస్పిటల్‌లో వైద్యం చేయించుకోని మహిళలకు మాత్రమే ఈ రూ.7,500 అందజేస్తారు.

కాగా ఈఎస్ఐ స్కీమ్‌లో రూ.21,000లోపు వేతనం ఉన్న వారు చేరవచ్చు. వీరికి పలు రకాల ప్రయోజనాలు లభిస్తాయి.

ఉద్యోగం పోయినప్పుడు డబ్బులు పొందటం, సహా ఈఎస్ఐ హాస్పిటల్స్‌లో ఉచిత వైద్యం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే మహిళలకు మెటర్నిటీ ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *