తూర్పు నౌకాదళం తీరo పొడవున బందోబస్తు భారీగా యుద్ధనౌకలు మోహరింపు

సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు ముక్కున నేపథ్యంలో విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు నౌకాదళం అప్రమత్తమైంది. తీరం పొడవునా పలు యుద్ధనౌకలను మోహరించి పహారా కాస్తుంది 24 గంటల పాటు రాడార్లతో గమనిస్తూ విశాఖ తీరం వైపు శత్రు దేశం నుంచి ఎలాంటి ముప్పు రాకుండా పలు చర్యలు చేపట్టింది.

19 71 వ సంవత్సరంలో పాకిస్థాన్ కు చెందిన పి ఎన్ ఎస్ ఘాజి జలంతర్గామి విశాఖ సమీపం వరకు రావడం నౌకాదళ అధికారులను అన్నాడు తీవ్ర విస్మయానికి గురిచేసింది.

దాన్ని గుర్తించి సముద్రంలోనే ధ్వంసం చేయడంతో పెను ప్రమాదం తృటిలో తప్పినటే అయింది, తూర్పు నౌకాదళం కి నాడు ఉన్న సిబ్బంది చాలా స్వల్పం ,కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు పూర్తిగా భిన్నం నాడు ఉద్యోగుల సంఖ్య భారీగా పెరగడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఎలాంటి తీవ్రమైన ముప్పు లనైన అయినా ముందుగానే పసిగట్టి తిప్పికొట్టేలా వ్యూహాలు సిద్ధం చేసింది. యుద్ధనౌకలను తీరం పొడవునా ఊహాత్మకంగా మోహరించారు.

అధునాతన ఆయుధాలతో ఆయా యుద్ధ నౌకల్లో పలువురు నాయకులు నిరీక్షిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు వచ్చిన వెంటనే కదనరంగంలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.

తూర్పు తీరం మొత్తాన్ని విశాఖలోని తూర్పు నౌకాదళం పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో నగరానికి ప్రాధాన్యం బాగా పెరిగింది.

గత రెండు రోజులుగా నౌకాదళ ఉన్నతాధికారులు పలు యుద్ధ వ్యూహాల పై వివిధ హోదాల్లో ఉన్నతాధికారులతో మేధోమథనం చేస్తున్నారు.

పలు శాఖల అధికారులతో కూడా మంతనాలు జరుపుతున్నారు.

ఎలాంటి దాడులు నైనా తిప్పికొట్టడానికి ఉన్నత అధికారులు ఆదేశిస్తే సైనిక స్థావరాలపై దాడులు చేయడానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.

దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో పాటు, ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హై ఆలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడి విమానాశ్రయ భద్రత అధికారులు అప్రమత్తమయ్యారు.

అదనంగా సీఐఎస్ఎఫ్ సిబ్బందిని నియమించి జాతీయ రహదారి నుంచి వెళ్లే మార్గంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *