ఇంతవరకు కట్టిన ఇల్లు పట్టుకుంటే పడిపోయే స్థితిలో ఉండేది., కానీ మేం నిర్మించిన గృహాలు అత్యాధునిక అయినవి : చంద్రబాబు

ఈరోజు నాలుగు లక్షల ఇళ్లకు గృహప్రవేశం చేశాం, ఇప్పటివరకు 11,3,989 ఇళ్లకు గృహప్రవేశం చేశామని చంద్రబాబు చెప్పారు.అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇన్ని ఇల్లు నిర్మించలేదని అన్నారు.

ముఖ్యంశాలు:
రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల లోపు దోషాలు నిర్వహించిన ప్రభుత్వం నెల్లూరులో జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు అత్యాధునిక సదుపాయాలతో పేదల కోసం ఇల్లును నిర్మించామని చెప్పారు.

గత పాలకుల హయాంలో నిర్మించి ఇచ్చిన ఇల్లు పట్టుకుంటే పడిపోయే స్థితిలో ఉన్నాయని, కానీ మేము నిర్మించిన అత్యాధునిక సదుపాయాలతో పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.

నెల్లూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ జిల్లాలో నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పాల్గొన్నారు.

నెల్లూరులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ’పేదల జీవన ప్రమాణాలు పెంచడానికి కష్టపడుతున్నాం పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం’అని వివరించారు. రెండు వందల రూపాయలు పెన్షన్ నుండి రెండు వేల రూపాయల వరకు పెన్షన్ పెంచామని చెప్పారు.

సాంకేతిక పరిజ్ఞానం తో ఇళ్లను నిర్మిస్తున్నాం. ప్రజలకు అండగా ఉండి ఆదుకుంటామని మాటిచ్చిన ఏపీ సీఎం నేను కష్టపడుతూ, మంత్రులు, అధికారులను కష్టపడుతున్నాను. అయినా ఈ రోజు మిమ్మల్ని బాధ పెట్టలేదు. పేద వాడి మొహంలో ఆనందం చేయడం కోసమే ఇదంతా చేస్తున్నామని వెల్లడించారు.

నెల్లూరులో ప్రభుత్వ నిర్మించిన గృహ సముదాయం.

గ్రీన్ టీతో ఎన్నో సమస్యలు వచ్చినా ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్తున్నామని… పెన్షన్లు, డోక్రా మహిళల కు నగదు ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. మహిళల ఆదరణను ఎప్పుడు మరిచిపోలేదని, ప్రజల కోసం తాము ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటామని, పేదల జీవన విధానాలు పెంచేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటామని తెలిపారు.

ప్రధాని మోదీ ఏం ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారు అని ప్రశ్నించారు. విభజన గాయం మానక ముందే కారం చల్లేందుకు వస్తున్నారు, మోడీ రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.

375 కోట్ల రూపాయలతో ఒకటి 630 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశామని, 32 గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించామని తె లిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా లక్ష 43 వేల మందికి లబ్ధి చే కూర్చోమన్నారు.నెల్లూరులో పసుపు కుంకుమ కింద వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చామని గుర్తుచేశారు.

తను నమ్ముకున్న వాళ్ళ కోసం చిన్న పరిశ్రమ హెరిటేజ్ ఏర్పాటు చేశామని, 27 ఏళ్ల పాటు తన భార్య భువనేశ్వరి పరిశ్రమను నడిపారని తెలిపారు. ప్రస్తుతం తన భార్య, కోడలు కలిసి పని చేస్తున్నారని చెప్పారు. తన కంపెనీ ద్వారా అనేక ఉద్యోగాలు ఇచ్చానని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *