ఆటో నడిపిన చంద్రబాబు

అమరావతి : ఆటోలపై జీవితకాల పన్ను రద్దు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు శనివారం తరలివచ్చారు.

పన్ను ఎత్తివేత నిర్ణయంపై ఆటోడ్రై వర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆటో డ్రైవర్ల నుద్దేశించి మాట్లాడారు.

తన జీవితానికి ఆటోడ్రైవర్ల జీవితానికి ఎన్నో దగ్గర పోలికలు ఉన్నాయ న్నారు.

ఆటో నడుపుతూ కుటుంబాన్ని డ్రైవర్లు పోషిస్తుంటే రాష్ట్రాన్ని నడుపుతూ ప్రజల సంక్షేమాన్ని తాను చూస్తున్నానని చంద్రబాబు తెలిపారు.

ఈ సందర్భంగా ఆటోవాలాలకు ముఖ్యమంత్రి మరిన్ని వరాలు కురిపించారు. ఆటో డ్రైవర్ చొక్కా ధరించి తన నివాస ప్రాంగణంలో స్వయంగా ఆటో నడిపి అందరిలోనూ హుషారు నింపారు.

ఇంధన ఛార్జీలు , ఇన్సూరెన్స్ భారం కూడా తగ్గించేలా చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు.

ఆటో డ్రైవర్లందరికీ పెద్దన్నగా తానుంటాన్నారు. ప్రయాణికులు క్షేమం మీరు చూసుకోండి… మీ క్షేమం నేను చూసుకుంటాను అని వారితో సీఎం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *