నిన్నటితో ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

నిన్నటితో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసాయి.

అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డ తరుణంలో సాయంత్రం నాలుగు గంటలకు ఏపీ కేబినెట్ సమావేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించనున్నారు.

ఎన్నికల కోడ్ వస్తున్న నేపద్యంలో రకరకాల పెండింగ్ అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.

ఏడు జిల్లాల పరిధిలో త్వరలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈ కాబినెట్ మీటింగే చివరి క్యాబినెట్ సమావేశాలు గా ఊహిస్తున్న ప్రభుత్వ వర్గాలు అన్ని విధాన నిర్ణయాలకు ఈరోజు ఆమోదం లభిస్తుందంటున్నారు.

ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా పడితే మరో క్యాబినెట్ భేటీకి అవకాశం ఉంటుందని ఊహిస్తున్నారు.

మార్చి నెల పదో తారీకున ఎమ్మెల్సీఎన్నికల కోడ్ అమల్లో ఉండనుండగా… ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసే సమయానికి జనరల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున ఈ రోజు జరిగే క్యాబినెట్ సమావేశం ముఖ్యంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *