శ్రీకాకుళం జిల్లా డీఎంహెచ్వో కార్యాలయాన్ని ముట్టడించిన ఆశావర్కర్లు….. రానున్న ఎన్నికలలో బాబు కి గుణపాఠం.

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను తక్షణమే పరిష్కరించాలని ఆశా వర్కర్ యూనియన్ డిమాండ్ చేశారు.

నెరవేర్చకపోతే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘ నాయకులు చలో డి ఎం హెచ్ ఓ కార్యక్రమానికి సోమవారం పిలుపునిచ్చారు.

ఈ పిలుపు అందుకున్న వందలాది మంది ఈ పిలుపు అందుకున్న వందలాది మంది కేంద్రానికి వస్తుండగా మార్గమధ్యంలో అడ్డుకొని పలువురిని అరెస్టు చేశారు.

పోలీసులు మంది మాత్రం జిల్లాకు చేరుకుని డి హెచ్ ఎన్ వో కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు.

కార్యాలయం లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించగా భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఆశా వర్కర్ యూనియన్ కమిటీ జిల్లా కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు ఆదిలక్ష్మి, నాగమణి మాట్లాడుతూ… చేయించుకుంటున్న ప్రభుత్వం పనికి తగ్గ వేతనం చెల్లించడం లేదని అన్నారు.

ఇటీవల విజయవాడలో చెట్లకు 8,500 ఇస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే అందులో కోత విధిస్తూ జీవో జారీ చేసారని మండిపడ్డారు. గౌరవ వేతనంలో కోత లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇచ్చిన హామీ నిలబెట్టు కోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తెలిపారు.

న్యాయమైన తమ డిమాండ్ల కోసం పోరాటం జరుపుతుంటే జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల కార్యకర్తలను అరెస్టు చేయడం మంచిది కాదు అని ఖండించారు.

ఇటువంటి అణిచివేతకు భయపడేది లేదని హెచ్చరించారు. ఆశా వర్కర్ లను మోసగించాలని చూస్తే చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదని అన్నారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ కార్యదర్శి తిరుపతి రావు, ఆశా సంఘ నాయకులు స్వప్న, కల్పన, దమయంతి, అమర, గీత, సుధ, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా ఆశ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

ఆముదాలవలసలో 35 మంది పొందూరులో 20 మందిని అరెస్టు చేస్తారు ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తు మీద విడిచిపెట్టారు.

జలుమూరు లో ఇద్దరు, వీరఘట్టం మండలం లో 11మంది, నరసన్నపేట లో 27 మంది, సామర్లకోట లో ఎనిమిది మంది ని అరెస్టు
చేశారు. రాజా మండలంలో కార్యకర్తలను ముందుగానే అరెస్టు చేశారు .

అరెస్టయినవారిలో యూనియన్ అధ్యక్షులు కే తులసి రత్నం తో పాటు సీఐటీయూ డివిజన్ కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు ఉన్నారు.

టెక్కలి నియోజకవర్గం లో 18 మంది తో పాటు సిపిఎం నాయకులు నంబూరు షణ్ముఖరావు, పోలాకి ప్రసాద రావును పోలీసులు అరెస్టు చేశారు. అలాగే సోంపేట లో ఎనిమిది మంది కంచిలో ఆరుగురిని అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *