తిరుమలలో జరిగింది అన్యమత ప్రచారం కాదు

ఇది టీడీపీ మరియు టీడీపీ రహస్య అనుబంధ పార్టీలు ఈ ప్రభుత్వం పై చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే.
అవి గత టీడీపీ ప్రభుత్వం తమ ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం ప్రచురించినవే. ఆ టికెట్ బండిల్ ని అధికారులు చూసుకోకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగింది. ఆ టికెట్లు కూడా ఒక్క బస్సులో మాత్రమే ఇవ్వడం జరిగింది.

ఈ విషయం తెలిసిన వెంటనే నిన్న మధ్యాహ్నమే అధికారులకు ఆదేశాలు జారీ చేసి వెంటనే ఆ టికెట్ బండిల్స్ ను వెనక్కు రప్పించడం జరిగింది. వాటికి ఈ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది కావాలనే ఈ ప్రభుత్వం చేసిందని కొంతమంది చేస్తున్న విమర్శలలో వాస్తవం లేదు.
ఒకవేళ ఇది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే దాని పై కూడా విచారణకు ఆదేశించాం, విచారణలో ఎవరైనా కుట్రపూరితంగా చేసారని తేలితే ఎంతటి వారి పైన అయిన కఠిన చర్యలు తీసుకుంటాం.
