ఏపీ, తెలంగాణకు పవర్ కట్.. ఎన్టీపీసీ హెచ్చరిక.

త్వరలో తెలుగు రాష్ట్రాల్లో అంధకారం నెలకొంటుందట. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడమే అందుక్కారణం. గడువులోగా బకాయిలు చెల్లించపోతే విద్యుత్ సరఫరా నిలిపేస్తామనిహెచ్చిరించింది.
ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 9ని తుది గడువుగా నోటీసుల్లో పేర్కొంది. గత రెండు నెలల పైబడి పలు రాష్ట్రాలు విద్యుత్ బకాయిలు చెల్లించడంలేదని ఎన్టీపీసీ తెలిపింది.
దక్షిణాది నుంచి తెలంగాణ, ఏపీతో పాటు కర్ణాటక రాష్ట్రం కూడా ఈ జాబితాలో ఉంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం రూ.7,859 కోట్ల బకాయిలు పెండింగ్‌లు ఉన్నాయని ఎన్టీపీసీ తెలిపింది.
ఇందులో సింహ భాగం ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచే రావాల్సి ఉంది. ఈ మూడు రాష్ట్రాల నుంచి మొత్తం రూ. 4,890 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని కంపెనీ వెల్లడించింది. వీటి తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది.

ఎన్టీపీసీకి రాజస్థాన్ రూ. 2404 కోట్లు, పంజాబ్ రూ. 1,041 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎన్టీపీసీతో పాటు ఇతర విద్యుత్ సరఫరా కంపెనీలకు కూడా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం ఏకంగా రూ. 6,127 కోట్లుగా ఉంది.