రాష్ట్రంలో యథేచ్చగా సాగిన కోడిపందాలు పత్తాలేని పోలీసులు

రాష్ట్రంలో సోమవారం కోడిపందాలు యథేచ్ఛగాసాగాయి. ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలో వీటికి వేదికలు. పందాలు రూపంలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. అనేక చోట్ల రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు పందాలను దగ్గరుండి మరీ ప్రోత్సహించడం గమనార్హం. కోడి పందాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున సామాన్యులతో పాటు అనేకమంది, పందెం రాయుళ్లు పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. అన్ని చోట్ల ఒకేసారి కోడిపందాలు ప్రారంభమయ్యాయి మహిళలు యువత సైతం కోడిపందాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీసులు చేసిన చర్యలు తిత్తులు గానే మిగిలిపోయాయి. జిల్లాలో ఆకివీడు మండలం అయి భీమవరం, పాలకొల్లు మండలం పూలపల్లి, భీమవరం మండలం పెద్ద గురువు, వీరవాసరం మండలం వీరవాసరం, ఉండి మండలం మహదేవపట్నం, పెదవేగి మండలం కొప్పాక, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, దేవులపల్లి, లక్కవరం, కేతవరం యలమంచిలి మొగల్తూరు తణుకు మండలం తేతలి తదితర ప్రాంతాల్లో కోడిపందాలు జోరుగా సాగాయి.

ఇంచుమించు 500 చోట్ల కోడిపందాలు బరులు వెలిశాయి. ఆకివీడు మండలం అయి భీమవరం వేదిక ఏర్పాటు ఐదు లక్షలు ఖర్చు చేశారు వీక్షకులు కోడిపందాలు చూడడానికి భారీ ఎల్ ఈ డి లు తెరలు ఏర్పాటు చేశారు. హైదరాబాదు, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పందెం రాయుళ్లు తరలివచ్చారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధు లా ఒత్తిడి మేరకు ముందుగానే ప్రారంభించారు. 100 కోట్ల వరకు చేతులు మారి ఉంటాయని అంచనా వేస్తున్నారు. రెండు రోజుల వరకు పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చిన పోలీసులు సోమవారం మాత్రం పత్తా లేకుండా పోయారు. తూర్పుగోదావరి జిల్లాలో కోడిపందాలు జోరుగా సాగాయి రాజమహేంద్రవరం కాకినాడ గ్రామీణ మండలంలో సోమవారం బరుల వద్ద 25 కోట్ల మేర చేమారినట్టు అంచనా. కృష్ణా జిల్లా ఈడుపుగల్లు లో కోడి పందాలకు వేల సంఖ్యలో జనం తరలి వచ్చారు. వాహనాలతో ప్రాంగణమంతా కిక్కిరిసి పలుమార్లు ట్రాఫిక్ స్తంభించింది. ఈ బరుల వద్ద మద్యం దుకాణాలు కూడా వెలిశాయి. రాష్ట్రమంతా ఈ కోడి పందాలు యథేచ్ఛగా సాగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *