పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తొలి విజయం అందుకున్నారు…

జగన్ తొలి అడుగు సక్సెస్!.. రివర్స్ టెండరింగ్‌తో భారీ ఆదా
పోలవరం ప్రాజెక్ట్ 65 ప్యాకేజీ పనులకు శుక్రవారం ఈ – ఆక్షన్ (రివర్స్ టెండరింగ్ ) నిర్వహించారు.
టెండర్ పిలిచిన అంచనా వ్యయం కన్నా 15.6 శాతం తక్కువకు ఓ కంపెనీ బిడ్ దాఖలు చేసింది.
ఇదే సంస్థ టీడీపీ ప్రభుత్వ హయాంలో అంచనా విలువ కంటే 4.8 శాతం ఎక్కువకు బిడ్ వేయడం గమనార్హం.
పోలవరం రివర్స్ టెండరింగ్ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తొలి విజయం అందుకున్నారు. రివర్స్ టెండరింగ్‌పై ప్రతిపక్షాల విమర్శలను పక్కనపెట్టి మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు.
పోలవరం ప్రాజెక్టు 65 వ ప్యాకేజీ పనుల్లో రూ.43 కోట్లు ఆదా చేసి చూపించారు. రివర్స్ టెండరింగ్ లాభదాయకమేనని నిరూపించారు.
కేవలం రూ.274 కోట్లకు నిర్వహించిన రివర్స్ టెండర్లలోనే 15 శాతానికి పైగా ప్రజాధనం ఆదా అవడం విశేషం.
తొలిసారిగా పోలవరం ప్రాజెక్ట్ 65 ప్యాకేజీ పనులకు శుక్రవారం ఈ – ఆక్షన్ (రివర్స్ టెండరింగ్ ) నిర్వహించారు.
ఇందులో ఆరు సంస్థలు పోటీపడ్డాయి. రెండు గంటల 45 నిమిషాల పాటు ఈ-ఆక్షన్ నిర్వహించారు.
టెండర్ పిలిచిన అంచనా వ్యయం కన్నా 15.6 శాతం తక్కువకు మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ బిడ్ దాఖలు చేసింది.
మొత్తం పని విలువలో రూ.43 కోట్ల తక్కువకు బిడ్ దాఖలు చేయడం విశేషం. ఇదే సంస్థ టీడీపీ హయాంలో అంచనా విలువ కంటే 4.8 శాతం ఎక్కువకు బిడ్ వేయడం గమనార్హం.
గత టీడీపీ ప్రభుత్వం ఇదే ప్యాకేజీని రూ.274 కోట్లకు కాంట్రాక్ట్ అప్పగించింది. జగన్ ప్రభుత్వం ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేసి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. అదే పనికి ప్రస్తుతం మ్యాక్స్ సంస్థ రూ.231 కోట్లకు బిడ్డింగ్ దాఖలు చేసినట్లు సమాచారం.
ఆ సంస్థతో పాటు మిగిలిన సంస్థలు కూడా ఎంతెంత ధరకు టెండర్లు దాఖలు చేశారనే విషయం ఈ రాత్రికి అధికారికంగా తెలిసే అవకాశం ఉంది.
సాధారణంగా ఎల్-1గా వచ్చిన సంస్థకు పనిని అప్పగిస్తూ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. అయితే రివర్స్ టెండరింగ్‌లో ఎల్-1గా వచ్చిన సంస్థ ధరను బేసిక్ బెంచ్ మార్క్‌గా ప్రకటించి దాని ఆధారంగా మరింత తక్కువకు సంస్థలు టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.
తొలుత పిలిచిన 65వ ప్యాకేజీలోని పనికి 15.6 శాతం తక్కువకు సంస్థ బిడ్ దాఖలు చేయడంతో సదరు సంస్థకు పనిని అప్పగించే అవకాశాలు ఉన్నాయి.