జగన్ పాలన ఆరు నెలలు పూర్తవుతుండటంతో..ఆరు మాటల్లో అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

YS Jagan ఆరు నెలల పాలన.. ఆరు మాటల్లో.. పవన్ ఆసక్తికర ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరు నెలల పాలన ఆరు మాటల్లో అంటూ.. వరుస పెట్టి ట్వీట్‌లు చేసిన పవన్ కళ్యాణ్. కొద్దిరోజులుగా జగన్‌ సర్కార్‌ను ట్విట్టర్‌లో టార్గెట్ చేస్తున్న జనసేనాని.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు అవుతోంది. నవరత్నాలు, సంక్షేమ పథకాలు, వినూత్న ఆలోచనలతో దూసుకెళుతున్నారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ.. ప్రతి నెలా ఏదో ఒక సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. జగన్ పాలన ఆరు నెలలు పూర్తవుతుండటంతో..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ట్విట్టర్‌లో జగన్ ఆరు నెలల పాలన.. ఆరు మాటల్లో అంటూ ఆసక్తికర ట్వీట్‌లు చేశారు.

జగన్ తన ఆరు నెలల పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదని పరోక్షంగా విమర్శించారు పవన్ కళ్యాణ్.

ఆయన చేసిందల్లా అంటూ ఆరు అంశాలను ప్రస్తావిస్తూ ఘాటుగా స్పందించారు. విధ్వంసం, దుందుడుకుతనం, కక్షసాధింపుతనం, మానసికవేదన, అనిశ్చితి, విచ్ఛిన్నం మాత్రమే అంటూ వరుసగా ట్వీట్‌లు చేశారు.

ఒక్కో పదానికి.. ఒక్కో ట్వీట్‌లో వివరణ ఇస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్.. అప్పటి నుంచి జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నారు. రోజుకో అంశంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం విద్య ఇలా అన్ని అంశాలపై స్పందించారు.

తాజాగా జగన్ ఆరు నెలల పాలనపై స్పందిస్తూ విమర్శలు చేశారు. పవన్ ట్వీట్లపై వైఎస్సార్‌సీపీ ఎలా కౌంటర్ ఇస్తుందన్నది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *