మనసున్న మారాజు కిడ్నీ పేషెంట్ల విషయంలో మరో కీలక నిర్ణయం.. వారికి ఉచితంగా….

కిడ్నీ పేషెంట్ల విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

చాలామంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు చికిత్సల నిమిత్తం ఒక చోట నుంచి వేరే ప్రాంతానికి బస్సులో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వారికి ప్రయాణం భారం తగ్గించే విషయంలో జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన జగన్ మోహన్ రెడ్డి పథకం..

మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకెళ్తున్న ఏపీ సీఎం జగన్.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ప్రజల కోసం అనేక సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అండగా నిలిచిన ఆయన.. తాజాగా కిడ్నీ పేషెంట్ల విషయంలో నిర్ణయం తీసుకున్నారు.. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఫ్రీగా బస్ పాస్‌లను జారీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

డయాలసిస్‌ చేయించుకునేందుకు తరచుగా వెళ్లే కిడ్నీ పేషెంట్లకు ప్రయాణ ఛార్జీలు అధిక భారంగా మారుతున్నాయి.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 లక్షల మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు జగన్ సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

పాక్షికంగా అంధత్వం కలిగిన వారికి కూడా ఫ్రీ పాస్‌లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.

కరోనా కారణంగా ఉపాధి సౌకర్యం కోల్పోయిన వలస కార్మికులకు కూడా జగన్ ఉచిత బస్ సౌకర్యం కల్పించారు.

రోడ్లపై నడుచుకుంటూ వెళ్తోన్న వలస కార్మికులు ఎక్కడ తారసపడ్డా వారిని బస్సులు ఎక్కించి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాల్సిందేనన్నారు.

అదేవిధంగా వారికి భోజనాలు, మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు.

బస్సుల్లో వలస కూలీలకు 15 రోజులపాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు.

ఇదిలో ఉంటే మరోవైపు ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 222 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఈ 222 కేసుల్లో రాష్ట్రానికి చెందినవి 186 కేసులు కాగా.. విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 36 మంది ఉన్నారు.

దీనితో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 4588కి చేరింది.

ఇందులో యాక్టివ్ కేసులు 1865 ఉండగా, 2641 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక మొత్తం 82 మంది వైరస్ కారణంగా మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *