‘బాబు ఇక రాజకీయ నిరుద్యోగి .. అందుకే దేశ దిమ్మరి యాత్రలు’

23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా మారే చంద్రబాబు కొత్త వర్క్ కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడు. ఈయనకు ఉపాథి కల్పించే స్థితిలో వారెవరూ లేరు. వాళ్లే అసలు ఉద్యోగం లేకనో, సగం పనితోనో కాలం గడుపుతున్నారు.

చంద్రబాబు రాజకీయ నిరుద్యోగి కాబోతున్నారు
కొత్త పని కోసం ఎక్కని, దిగని గడపంటూ లేదు
ఓటమి తప్పదని తెలిసి తనను తాను ఊరడించుకుంటున్నారు.

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు కొన్ని గంటల సమయమే ఉంది. ఏపీలో అధికారంలోకి వచ్చేది తామంటే.. తామంటూ టీడీపీ, వైసీపీలు ధీమాతో ఉన్నాయి.

ఇటు ఎగ్జిట్ పోల్స్ తర్వాత రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేరుగా చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ ఓటమి ఖాయమని.. రాజకీయ నిరుద్యోగి కాబోతున్నారంటూ ట్విట్టర్‌లో సెటైర్లు పేల్చారు.

‘23వ తేదీతో రాజకీయ నిరుద్యోగిగా మారే చంద్రబాబు కొత్త వర్క్ కోసం ఎక్కని గడప, దిగని గడప లేదన్నట్టు తిరుగుతున్నాడు.

ఈయనకు ఉపాథి కల్పించే స్థితిలో వారెవరూ లేరు. వాళ్లే అసలు ఉద్యోగం లేకనో, సగం పనితోనో కాలం గడుపుతున్నారు’అంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.

‘ఒక ప్రయోజనకర కార్యక్రమం కోసం ప్రయాణాలు చేస్తే అందరూ ప్రశంసిస్తారు. చంద్రబాబు తిరుగుళ్లు మాత్రం ఊసుపోక చేస్తున్న దేశదిమ్మరి యాత్రల్లా ఉన్నాయి.

ఓటమి తప్పదని తెలిసి తనను తాను ఊరడించుకునేందుకు ప్రాంతీయ నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు’అంటూ పంచ్ పేల్చారు.

‘ఏపీలో ఎన్నికల కౌంటింగును నిలిపి వేయించడానికి చంద్రబాబు చేయని కుతంత్రం లేదు.వివిప్యాట్ల లెక్కింపు పేరుతో రెండు సార్లు సుప్రీంలో పిటిషన్ వేసి ఓడిపోయాడు.

తన అనుకూల వ్యక్తులతో ఏపి హైకోర్టులో, సుప్రీంలో మరోసారి అత్యవసర పిటిషన్లు దాఖలు చేయించినా తిరస్కరణకు గురయ్యాయి’అన్నారు.

‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు అనుబంధంగా అమర్చిన ప్రింటర్ లాంటి పరికరాలే వీవీప్యాట్లు.ఇవిఎంలలో నమోదైన ఓట్ల ఆధారంగానే లెక్కింపు ఉంటుంది.

వివిప్యాట్లను ముందు లెక్కించాలనే వాదన చూస్తే, గుర్రం బలంగా ఉందో లేదో చూడకుండా దాని తోకను కొలవాలనే మూర్ఖపు డిమాండులాగా కనిపిస్తోంది’అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed