అసూయ పరులంతా ఒక్కరే ఐ చిచ్చు పెడుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధ్వజం

Chandrababu Changes Colours Like Chameleon
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని జీర్ణించుకోలేని ప్రధాని నరేంద్ర మోడీ, వైకాపా అధ్యక్షుడు జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంపై గద్దల్లా వాలుతున్నారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రం పై కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ చెబుతున్నా ఫెడరల్ ఫ్రంట్ స్పందన లేదని. తెరాస నేత కేటీఆర్ హడావిడిగా జగన్తో భేటీ అయ్యారని ఆక్షేపించారు. తెరాస, వైకాపా ఒకటేనని మరోసారి స్పష్టమైందని వారి ముసుగు తొలగిపోయిందని వ్యాఖ్యానించారు. తెరాస నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు మండిపడ్డారు. మొక్కులు తీర్చుకోవడానికి వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస యాదవ్ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కొందరు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారని ఆయన కూస్వాగతం చెప్పారని సీనియర్ నేత ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.
శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన నాయకులకు షోకాజ్ నోటీసు ఇచ్చి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. తెరాస నాయకులు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు తెలుగుదేశం నాయకులు ఎవరూ పాల్గొనరాదని ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా ఆ పార్టీకి మోదీకి లబ్ధి చేకూర్చేందుకు కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కుట్రకు తెరతీశారని ఆరోపించారు. బిజెపి తెరాస వైకాపా నాయకులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అమరావతిలో అభివృద్ధి పనులు వారికి కంటికింపుగా మారాయి. వాళ్లంతా ఒకటే రాష్ట్రంపై గద్దల్లా వాలుతున్నారు అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.