రాబోయే ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వందశాతం ఓటమి ఖాయం: కేటీఆర్

చంద్రబాబు ఓటమి ఖాయం: కేటీఆర్
తెలంగాణ ప్రజలు ఢిల్లీని శాసించాలనే నినాదంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకెళ్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. 16 ఎంపీ సీట్లలో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

1.ఢిల్లీలో కాదుకదా అమరావతిలో కూడా చక్రం తిప్పలేరన్న కేటీఆర్
2.చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో కాదుకదా.. అమరావతిలో కూడా చక్రం తిప్పే పరిస్థితులులేవని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వందశాతం ఓడిపోతారని జోస్యం చెప్పారు. ఏపీలో పారిశ్రామికవేత్తలపై ఐటీ దాడులు జరిగితే చంద్రబాబుకు ఏమైంది? దేశంలో అన్ని రాష్ర్టాల్లో ఐటీ దాడులు జరుగుతాయి. అలాంటప్పుడు ఒక్క చంద్రబాబుకే ఉలిక్కిపాటు ఎందుకని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో ఆస్తులుంటే వైసీలో చేరాలని మేము చెబుతున్నామా? అలాగైతే.. హైదరాబాద్‌లో చంద్రబాబుకు కూడా ఆస్తులు ఉన్నాయి కదా అని కేటీఆర్ అన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు కలలో కూడా సీఎం కేసీఆర్‌ను కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘ కేంద్రం అన్యాయం చేసిందనేది చంద్రబాబే.. మేమే నంబర్‌వన్‌’ అనేది కూడా ఆయనే అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజలు ఢిల్లీని శాసించాలనే నినాదంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకెళ్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. 16 ఎంపీ సీట్లలో టీఆర్‌ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చెబుతున్నట్లుగా సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ వర్సెస్ మోదీ వాతవరణం ఉండదని..

రెండు పార్టీలకూ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో మార్చి 1 నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఎన్నికల తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీ పదవుల నియామకాలు ఉంటాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *