2020 నుంచి 2023 నూతన పారిశ్రామిక విధానం అమల్లో..ఏపీ కేబినెట్ నిర్ణయాలు

ఏపీ కేబినెట్ నిర్ణయాలు.. విద్యార్థులు, డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్

వైఎస్సార్ విద్యాకానుక పథకానికి ఓకే చెప్పారు. సెప్టెంబరు 5 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. అలాగే డ్వాక్రా మహిళకు సంబంధించి వైఎస్సార్ ఆసరా పథకానికి ఆమోదం తెలిపారు.

డ్వాక్రా మహిళలకు నాలుగేళ్లలో రూ.27 వేల కోట్ల కు పైగా ఆసరా ద్వారా లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది.

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదముద్ర వేసింది. 2020 నుంచి 2023 వరకు ఈ నూతన పారిశ్రామిక విధానం అమల్లో ఉంటుంది.

వైఎస్సార్ విద్యాకానుక పథకానికి ఓకే చెప్పారు. సెప్టెంబరు 5 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది.

అలాగే డ్వాక్రా మహిళకు సంబంధించి వైఎస్సార్ ఆసరా పథకానికి ఆమోదం తెలిపారు. డ్వాక్రా మహిళలకు నాలుగేళ్లలో రూ.27 వేల కోట్ల కు పైగా ఆసరా ద్వారా లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది.

అలాగే సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించే వైఎస్సార్‌ సంపూర్ణ పోషకాహార పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

మహిళలు, శిశువులకు సంబంధించి పూర్తి స్థాయిలో పోషకాహారం అందించే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశారు. బీసీ ఫెడరేషన్లు, రామనపాడు పోర్టు డీపీఆర్‌కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

పంచాయతీ రాజ్ శాఖలో 51 డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారుల పోస్టులకు ఆమోదించారు.

విశాఖపట్నంలో 1జి డబ్ల్యూ డేటా సెంటర్ ఏర్పాటుకు ఓకే చెప్పారు. సామాజిక భద్రత పథకం కింద వైఎస్సార్ బీమా పథకానికి ఆమోదం తెలిపారు.

కడప జిల్లాలో పోలీస్ శాఖ బలోపేతానికి కేబినెట్ ఓకే.. కడప, చిత్తూరు జిల్లాల్లో ఏర్పాటైన డిగ్రీ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకంపై నిర్ణయం తీసుకుంది.

గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై కేబినెట్‌ చర్చించింది. రాజధాని భూముల కుంభకోణంపై చర్చ జరగనుంది.

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం, పాలనా వికేంద్రీకరణ బిల్లు, ఇళ్ల పట్టాల పంపిణీ, న్యాయపరమైన సమస్యలు, కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై కేబినెట్ చర్చించింది.

కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించే అవకాశముంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాల గెజిట్ నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడంపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై చర్చించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *