అమరావతిలో తెలుగుదేశం నిలువ దోపిడీకి మరో ఉదాహరణ

తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టె చాగంటి సతీష్ చౌదరి దోపిడీ 400 కోట్లు. స్వార్థ ప్రయోజనాల కొసం అమరావతి భూములను ధారాదత్తం చేసిన చంద్రబాబు.

వీళ్ళ దోపిడీ కి అంతు లేదా???

కేవలం FB లో post పెట్టేవాడికి 7 ఎకరాలు ఇచ్చారు అంటే …. బాబు గారు ఎంత దోచుకుని ఉంటారు ?

పచ్చళ్ళ website పెట్టుకుని పొగాకు మీద 70 వేల కోట్ల ఆదాయం అన్నప్పుడే ఏమిటి ఇలా మాట్లాడుతున్నాడు అని …..

సతీష్ చాగంటి ..సోషల్ మీడియాలో వుండే అందరికీ ఈ పేరు సుపరిచితమే . చంద్రబాబు వంటిమీద ఈగ వాలనివ్వడు . పచ్చ మీడియా చిమ్మే విషంలో ప్రధాన పాత్ర ఇతనిదే . బ్రింగ్ బాబు బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసి ..అదే సమయంలో వైయస్ కుటుంబంపై విషం చిమ్మినందుకు చంద్రబాబు భారీగానే దోచిపెట్టాడు .

కుంభకోణం జరిగిన తీరుతెన్నులు జాగ్రత్తగా చూడండి . పచ్చముఠా ఎంత పకడ్భందిగా దోచుకొంటుందో తెలిస్తే మనకి కళ్ళు బైర్లు కమ్మాల్సిందే .

— అమరావతి మెరీనా పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసింది . మెరినాలో 100 బెర్తుల బోట్లకి సౌకర్యం ఉండేటట్లు , వాటి రిపేర్లకు , కృష్ణానదిలో షికార్లు , నీళ్ళల్లో జలక్రీడలు , టూరిజం లాంటివన్నీ ఈ ప్రాజెక్ట్ కిందకి వచ్చే విధంగా ప్లాన్ చేసారు .

దానికోసం తుళ్లూరు మండలంలో 8 ఎకరాలని కేటాయించారు . సర్వే నెంబర్లు 59,60,62,63,64 అలానే నదికి మరో వైపు సర్వే నెంబర్లు 48,49,59 లలో ఉన్న మొత్తం 7 ఎకరాల 38 సెంట్లు భూమిని ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించారు .

**ఫోటోలు 1,16,17 ( ఈ ప్రాజెక్ట్ కోసం 7 ఎకరాల 38 సెంట్లు కేటాయిస్తూ ప్రభుత్వ నిర్ణయం .. అదే భూమికి సంభందించిన ప్రభుత్వ రెవెన్యూ మ్యాప్ లు .

— ఈ ప్రాజెక్ట్ కోసం ఇదే రంగంలో అనుభవజ్ఞులైన కంపెనీలు టెండర్లలో పాల్గోవాలని 2018 జూన్ 2 వ తారీఖున టెండర్లు పిలిచారు . టెండర్లలో ఈ క్రింది నిబంధనలు పెట్టారు .
— మెరినా / బీచ్ లు నిర్వహించటంలో అనుభవం . టూరిజంలో అనుభవం . జలక్రీడలు మరియు బోట్లు , విహార యాత్రలు నిర్వహించే అనుభవం లాంటి నిబంధనలు పెట్టారు .

  • ఫోటో 2 ( ఈ ప్రాజెక్ట్ టెండర్లలో పాల్గొనటానికి ప్రభుత్వం పెట్టిన నింబంధనలు )

— ఈ ప్రాజెక్ట్ ని ఎవ్వరికి కట్టబెట్టాలో ముందుగానే నిర్ణయించిన చంద్రబాబు .. సతీష్ చాగంటితో 2018 మే 29 న ‘ అమరావతి కోస్తా ఈ-మెరీనా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని పెట్టించాడు .

  • ఫోటోలు – 3 నుండి 10 వరకు ( సతీష్ చాగంటి పెట్టిన కంపెనీల వివరాలు )
  • ఫోటో 7 ( అన్నీ కంపెనీలకి ఒకటే ఈమెయిలు ఐడి [email protected] , ఒకటే అడ్రస్ )

— ఇక్కడే జాగ్రత్తగా గమనించండి . టెండర్లు పిలిచే సరిగ్గా మూడంటే మూడే రోజులు ముందు సతీష్ చాగంటితో ఈ కంపెనీని పెట్టించారు . పైన పేర్కొన్న నిబంధనలు ఏవీ అనుసరించలేదు .

— టెండర్లలో ఎన్ని కంపెనీలు వచ్చాయో అసలు ఎవరెవరు వచ్చారో ఆదేవుడికే తెలియాలి .మొత్తానికి అదే నెలలో ఈ ప్రాజెక్ట్ ని సతీష్ చాగంటి కంపెనీకి కట్టబెట్టారు .

**ఫోటోలు 11 ,12,13,14 ( సతీష్ చాగంటి తో ఒప్పందం చేసుకొని అదే విషయాన్ని ఘనంగా ‘ అమరావతి ప్రాజెక్ట్ ఎడిషన్ 04 లో పేజీ నెంబర్ 118 లో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తూ దిగిన ఫోటోలు . ఆ ఫొటోలలో సతీష్ చాగంటిని కూడా చూడొచ్చు .

** అమరావతి ప్రాజెక్ట్లు ఎడిషన్ 4 మొత్తం రిపోర్ట్ ఈ క్రింది ఉన్న CRDA లింక్లో చూడొచ్చు .

మొత్తం 8 ఎకరాలని నామమాత్రపు ధరకి అనగా ఎకరం లక్ష రూపాయలకే సతీష్ కి ఇచ్చేసారు . దీనిని ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నట్లు పేర్కొని 33 ఏళ్ళకి సతీష్ కంపెనీకే తిరిగి నిర్వహణా బాధ్యతలు అప్పగించారు .

  • చంద్రబాబు రెండు రోజుల క్రితం చెప్పిన దానిని బట్టి గజం లక్ష రూపాయల చొప్పున వేసుకొంటే సతీష్ చాగంటికి దోచిపెట్టిన భూమి విలువ దాదాపుగా 400 కోట్లు .

— సవంత్సరానికి 100 కోట్లు ఆదాయం వచ్చే విధంగా మొత్తం 33 సంవత్సరాలకి కట్టబెట్టారు . అంటే రాబోయే 33 ఏళ్లలో ప్రభుత్వ వాటా పోను మిగిలిన ఒక్క సతీష్ చాగంటికే 1700 కోట్లు లబ్ది చేకూరే విధంగా పకడ్భందిగా స్కెచ్ వేశారు . ఇందులో చినబాబు వాటా ఎంతో పెదబాబు వాటా ఎంతో పైనున్న ఎన్టీఆర్ కే తెలియాలి .

ఇంకో ముఖమైన విషయం

తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఈ కుంభకోనానికి సంభందించిన వివరాలు వెతుకుతుంటే దీనికి మించిన మరింత భారీ కుంభకోనానికి ఆస్కారమున్న విస్తుగొలిపే విషయాలు కనిపించాయి . వాటి వివరాలు ఇంకొద్ది రోజులలో మీముందుకు తెస్తాను …

కొన్ని విస్తుగొలిపే విషయాలు

— ఈ కుంభకోనం కోసం సతీష్ చాగంటి మొత్తం 4 కంపెనీలు పెట్టాడు .అమరావతి కోస్తా ఈ-మెరీనా ప్రైవేట్ లిమిటెడ్ , కోస్తా మెరీనా అండ్ క్లబ్ ప్రైవేట్ లిమిటెడ్ ,కోస్తా ప్లాంటేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ,కోస్తా అగ్రి ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలని పెట్టారు . ఈ నాలుగు కంపెనీలలో ఉమ్మడిగా ఉన్నది కానుమిల్లి వెంకట సూర్యప్రకాశరావు అనే అతను . సతీష్ చాగంటి డైరెక్టర్ గా ఉన్న మొదటి రెండు మెరీనా కంపెనీలకి ఈ కాంట్రాక్టు ఇచ్చారు .

— ఈ కంపెనీలన్నీ ఒకే అడ్రస్ కింద రిజిస్టర్ చేసారు . 33-21-33 , సీతారామపురం , ఏలూరు రోడ్ , విజయవాడ , కృష్ణ జిల్లా , ఏపీ . ఇదే అడ్రెస్ మీద కంపెనీలు రిజిస్టర్ చేసారు .

— ఇంకో అసలైన ట్విస్ట్ ఏమిటంటే ఇదే అడ్రస్ తో ( డోర్ నెంబర్ తో సహా ) మొత్తం 491 కంపెనీలు రిజిస్టర్ చేసారు . ఇవి మొత్తము డమ్మీ సూట్కేసు కంపెనీలు . దాదాపుగా కంపెనీలు అన్నీ ( 90 శాతం పైగా ) 2015 నుండి 2019 మార్చి మధ్యలోనే స్థాపించారు .

  • ఫోటోలు 9,10 ( ఒకే అడ్రస్ ఒకే డోర్ నెంబర్ తో మొత్తం 491 కంపెనీలు ఉన్నట్లు ఆధారం )

— ఈ మొత్తం 491 కంపెనీలకి ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు కేటాయించారో , ఎన్ని వందల కోట్లు దోచిపెట్టారో తెలియాలంటే సీబీఐ ఎంక్వయిరీ లాంటిది వేయాలి . నా ప్రయత్నంగా రాబోయే రోజుల్లో మరింత సమాచారం వెలికితీస్తాను .

— మొత్తం 55 వేల ఎకరాలు ( రైతుల దగ్గరనుండి తీసుకొన్నవి 33 వేల ఎకరాలైతే , మిగిలినవి ప్రభుత్వ భూములు ) . దీనిలో రైతులకి ప్లాట్లు రూపములో తిరిగి ఇవ్వాల్సింది 7 వేల ఎకరాలు , రాజధాని కోసం సింగపూర్ కంపెనీకి కట్టబెట్టింది 1600 ఎకరాలు . అంటే మొత్తం 8600 ఎకరాలు పోగా …మిగిలిన 46 వేల ఎకరాలు ఎవరెవెరికి ఎంత కట్టబెట్టారో అందులో పైన చెప్పిన 491 కంపెనీలు ఎన్ని ఉన్నాయో ముందుముందు బయటకి తెస్తాను .


ఇప్పుడైనా అర్థమైందా సతీష్ చాగంటి ఎందుకు అమరావతి అమరావతి అని కలవరిస్తున్నాడో . అవసరమైతే చంద్రబాబు నైనా వదులుకొంటాము కానీ అమరావతిని వదులుకోమని ఎందుకు గుక్కబట్టి ఏడుస్తున్నాడో తెలిసిందా .

ఒకసారి సతీష్ చాగంటి ఫేస్బుక్ ప్రొఫైల్ చూడండి . గడచిన నెలరోజులుగా అమరావతి మీద ఎలాంటి రాతలు రాస్తున్నాడో గమనించండి . అవసరమైతే కోస్తాఆంధ్ర రాష్ట్రం కోసమైనా పోరాడుతామని పోస్టులు పెడుతున్నాడు .

” కోస్తా ” పేరుతోనే కంపెనీలు పెట్టి అమరావతిలో ఇప్పటికే 400 కోట్లు విలువ చేసే భూములు కొట్టేసాడు . ఇప్పుడు వాటినన్నిటినీ ప్రభత్వం ఎక్కడ వెనక్కి తీసుకొంటుందేమో అని అమరావతి పేరుతో విషపు రాతలు రాస్తున్నాడు .

  • ఫోటో 13 ( సతీష్ చాగంటి పోస్టులు – చంద్రబాబు లేదు టీడీపీ లేదు తొక్కా లేదు .. మొత్తాన్ని పక్కనబెట్టి ‘ కోస్తా ఉద్యమం ‘ చేయాల్సిందేనని పోస్టులు .

ఫేస్బుక్ లో విషప్రచారం చేసే సతీష్ చాగంటి లాంటి వెధవలకే 400 కోట్లు విలువ చేసే భూమిని చంద్రబాబు కట్టబెట్టాడంటే …ఎన్నికలలో గెలవటానికి వేలకోట్లు ఖర్చుపెట్టిన చంద్రబాబు బినామీలకు ఎన్ని లక్షల కోట్లు దోచిపెట్టాడో మీరే ఊహించుకోండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *