హైడ్రాలిక్ పద్ధతిలో48 గేట్లకు..పోలవరం ప్రాజెక్ట్‌లో మరో ముందడుగు

పోలవరం ప్రాజెక్ట్‌లో మరో ముందడుగు

సోమవారం పూజలు నిర్వహించి.. మంగళవారం గేట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన గిడ్డర్ల బిగింపు ప్రక్రియ మొదలైంది. ఈ హైడ్రాలిక్ పద్ధతిలో గేట్ల వల్ల నిర్వహణ చాలా సులభంగా ఉంటుంది.

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. వర్షాలు పెరుగుతున్నా, గోదావరికి వరద పెరిగినా పనులు ఆపకుండా కొనసాగిస్తున్నారు.

ప్రాజెక్ట్‌కు సంబంధించి భారీ గేట్లను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా గేట్లు పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం పూజలు నిర్వహించి..

పోలవరంకు ఉన్న మొత్తం 48 గేట్లకు సంబంధించిన గడ్డర్ల బిగింపు పని 45-46 బ్లాకులోని పిల్లర్ల మీద మొదటి గడ్డర్‌ను అమర్చారు.

ఒక్కో గడ్డర్‌ బరువు 62 టన్నులు కాగా.. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌ వేలోని 52 బ్లాక్స్‌కు సంబంధించిన పియర్స్‌ నిర్మాణం ముగింపు దశకు వచ్చింది.

స్పిల్‌వే పియర్స్‌పై గడ్డర్లు ఏర్పాటు చేస్తే స్పిల్‌ ఛానల్‌ పనులలో దాదాపు అంత పూర్తి అయినట్లే. ప్రస్తుతం ఇవి 52 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి.

స్పిల్‌ వే మొత్తం దూరం 1.2 కిలో మీటర్లు కాగా.. ఇది ప్రపంచంలోనే పెద్దది.

ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసి వరద వచ్చినప్పుడు కిందకు విడుదల చేసేందుకు కీలకమైనదే స్పిల్‌వే కాగా.. దీనిలో గేట్ల నిర్వహణ ముఖ్యమైనది.

గేట్లు పనిచేయడానికే గడ్డర్లు ఉపయోగపడతాయి. వాటిపై హాయిస్ట్‌ వ్యవస్థను ఏర్పాటుచేసి తద్వారా గేట్లను నియంత్రిస్తారు.

ఇక స్పిల్‌ వేపై గడ్డెర్లను ఏర్పాటు చేసేందుకు నెల రోజు సమయం పడుతుంది. గడ్డర్ల ఏర్పాటు అనంతరం ఇనుప రాడ్లతో జల్లెడ ఏర్పాటు చేస్తారు.

ఆ తరువాత దానిపై కాంక్రీట్‌తో రోడ్‌ నిర్మిస్తారు. ఈ పనులన్నీ పూర్తి అయితే గేట్లు బిగింపు మినహా మిగిలిన ప్రధాన పనులు అన్ని పూర్తి అయినట్లే. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేయాలనే దృఢమైన సంకల్పంతో పనులు సాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *