దేశ చరిత్రలోనే తొలిసారి…గవర్నర్ ప్రసంగం హైలైట్స్..

మేనిఫెస్టోలో లేని 40 హామీలను నెరవేర్చామని.. వివిధ పథకాల ద్వారా 3.98కోట్లమందికి లబ్ధి చేకూర్చామన్నారు..

అలాగే 129 హామీల్లో 77 హామీలను ప్రభుత్వం నెరవేర్చిందని.. వివిధ సంక్షేమ పథకాలకు రూ.42వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

మొదట ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజ్‌భవన్ నుంచి ప్రసంగించారు.

ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు.

గత ఏడాది కాలంగా ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని.. 90శాతం ఇచ్చిన హామీలను అమలు చేశారన్నారు.

మేనిఫెస్టోలో లేని 40 హామీలను నెరవేర్చామని..

వివిధ పథకాల ద్వారా 3.98కోట్లమందికి లబ్ధి చేకూర్చామన్నారు..

వారి అకౌంట్లలోకి నేరుగా డబ్బులు జమ చేశామన్నారు.

అలాగే 129 హామీల్లో 77 హామీలను ప్రభుత్వం నెరవేర్చిందని..

వివిధ సంక్షేమ పథకాలకు రూ.42వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.

వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 8శాతం వృద్ధి రేటు సాధించారని గవర్నర్ వివరించారు.

పారిశ్రామిక రంగంలో 5శాతం వృద్ధి.. గతేడాదితో పోలిస్తే తలసరి ఆదాయం 12 శాతం వృద్ధి సాధించారన్నారు.

సేవారంగంలో 9.1 వృద్ధి.. 2019-2020లో 8.16శాతం వృద్ధి సాధించారని తెలిపారు.

నాడు-నేడు ద్వారా పాఠశాలల్ని ఆధునీకరిస్తున్నామని..

మూడేళ్లలో 48వేల పాఠశాలల్ని ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

ఇక జగనన్న గోరు ముద్ద పథకం కింద విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారని.. ఈ పథకం కింద రూ.1105కోట్లు ఖర్చు చేశామన్నారు.

ఇక జగనన్న వసతి దీవెన కింద రూ.3857కోట్లు ఖర్చు చేశారని..

ఈ పథకం కింద 18.51లక్షలమందికి లబ్ది చేకూరిందని..

వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా 67.68 లక్షలమంది లబ్ది పొందారన్నారు.

ఆరోగ్య శ్రీ ద్వారా పేదవారికి వైద్యం అందిస్తున్నామని.. దీని ద్వారా 6.25లక్షల మంది లబ్ది పొందారన్నారు.

ప్రతి గ్రామంలో వైఎస్సార్‌ క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.. నాడు నేడు కింద ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ వాహన మిత్ర, మత్స్యకార భరోసా, అమ్మఒడి ఇలా ఎన్నో పథకాలను తీసుకొచ్చామని..

ఆ సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిన నిధులు.. లబ్దిపొందినవారి వివరాలను ఉభయ సభల ముందు ఉంచారు.

రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు.

అలాగే నీటి ప్రాజెక్టులకు పెద్ద పీట వేస్తున్నామన్నారు.. 54 ప్రాజెక్టుల్లో 14 పూర్తయ్యాయని..

మరో ఏడాదిలో వెలుగొండ పూర్తి చేస్తామన్నారు. అలాగే మూడు రాజధానుల అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించారు.

అలాగే మూడు రాజధానుల అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించారు.

ఇక కరోనా చర్యల్లో ఇతర రాష్ట్రాల కంటే ముందున్నామన్నారు గవర్నర్. రోజుకు సుమారు 15వేలు టెస్ట్లు నిర్వహిస్తున్నామని..

రాష్ట్రంలో 5 ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులు.. జిల్లాల్లో 65 కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేశామన్నారు.

లాక్‌డౌన్‌ వలసకూలీలు, పేదలకు ఆర్థికసాయం అందించామన్నారు.

కరోనా కట్టడికి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుందన్నారు.

రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.2,200 కోట్లు ఆదా చేశామన్నారు బిశ్వభూషణ్.

రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడులో ఓడరేవుల నిర్మాణం.. మూడు ఓడరేవుల నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

ఇక రూ.7వేల కోట్లతో 30లక్షలమందికి ఇళ్లపట్టాలు అందిస్తున్నామని.. నాలుగేళ్లలో 25 లక్షల ఇళ్లను నిర్మిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *