ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల ప్రయోజనాలు:

  • కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు అందుతాయి.
  • ప్రత్యేక కేటగిరీ హోదా గల రాష్ట్రాలు ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, కార్పోరేట్ టాక్స్, ఆదాయ పన్ను మరియు ఇతర పన్నుల నుండి మినహాయించబడతాయి.
  • ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు 90 శాతం కేంద్ర నిధులను గ్రాంట్‌గా ఇస్తారు. మిగిలిన 10 శాతం వడ్డీ రేటుతో రాష్ట్రానికి రుణంగా ఇస్తారు. జనరల్ కేటగిరీ రాష్ట్రాల్లో రుణంగా 70 శాతం నిధులు, 30 శాతం గ్రాంట్ రూపంలో లభిస్తాయి.
  • కేంద్ర ప్రభుత్వ స్థూల బడ్జెట్‌లో 30% నిధులు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకే వెళతాయి.
  • ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్ర నిధులను  పొందుతాయి.
  • ప్రణాళికా సంఘం విదేశీ సాయంతో నడిచే పథకాలకు, నిర్దిష్ట పథకాలకు ఆర్థిక సాయం అందిస్తుంది.
  • కేంద్ర ప్రభుత్వ సాయంతో నడిచే పథకాలకు కూడా ఆర్థిక సాయాన్ని వర్తింపజేస్తుంది.
  • పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించి వస్తు ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఎక్సైజ్ డ్యూటీలో భారీ స్థాయిలో రాయితీలు ఇస్తారు.
  • ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు రుణాలపై వడ్డీని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వడ్డీ రాయితీ పథకాలు పొందే అవకాశం కూడా ఉంటుంది.
  • రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ అభివృద్ధి కోసం మరిన్ని  సంక్షేమ ఆధారిత పథకాలను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *