ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు

prakasam pantulu
ముక్కు పచ్చలారని న
వ్యాంధ్ర శిశువు
మూలుగుతూ మూలనున్న
ముసిలాడికి వధువు!
1953 లో ఎనభై అయిదేళ్ల టంగుటూరి ప్రకాశం పంతులు కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినపుడు నిరసనగా మహాకవి శ్రీశ్రీ రాసిన కవితాపంక్తులు అవి!
2014 లో మళ్ళీ నవ్యాంధ్ర ఏర్పడింది. ఒక యువకుడు, ఒక వృద్ధుడు ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడ్డారు. పాపం…ఆంధ్రులు వృద్ధుడివైపు మొగ్గు చూపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన మరునిముషమే ఆంధ్రప్రదేశ్ గంగాభగీరధీ సమానురాలైపోయింది. తొమ్మిదేళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని దోచుకుని, ఒక్క పరిశ్రమ కూడా తీసుకుని రాలేక, ఉన్న పరిశ్రమలన్నింటినీ మూసేసి, రాష్ట్రాన్ని దివాళా తీయించి, దిగిపోయేటపుడు అరవై వేలకోట్ల రూపాయల అప్పులను ప్రజల నెత్తిన మోపి తాను నిక్షేపంగా వెళ్ళిపోయాడు.
వైఎస్సార్ రాజకీయ చాణక్యం, పాలనాదక్షత కారణంగా చంద్రబాబును రెండుసార్లు జనం గోతిలో పాతిపెట్టారు. ఆ తరువాత జరిగిన ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కలేదు.
రాష్ట్రం చీలిపోవడం, జగన్ మీద సోనియాగాంధీ, చిదంబరం, చంద్రబాబు కుమ్మక్కై కేసులు బనాయించడం, ఎన్నికలనాటికి జగన్ అక్రమార్జన కేసుల్లో పీకలవరకూ కూరుకుని పోవడం, రెండు క్షుద్రపత్రికలు కులగజ్జి, అవినీతిలో బలిసిపోయి జగన్ కు వ్యతిరేకంగా రాత్రింబవళ్లు కావించిన దుష్ప్రచారం, చంద్రబాబు సిగ్గు లజ్జ విడిచి, అప్పటివరకు తాను తిట్టిపోస్తున్న మోడీ కాళ్ళు, పవన్ కాళ్ళు పట్టుకుని, కుల పిచ్చిని రెచ్చగొట్టి నవ్యాంధ్ర కు తొలి ముఖ్యమంత్రి కాగలిగేడు.
అధికారంలోకి రాగానే జగన్ అవినీతిని రుజువు చేసి జైలుకు పంపిస్తానని ప్రగల్భాలు పలికి, కేంద్రంతో సఖ్యత ఉన్నప్పటికీ, ఒక్క కేసును కూడా నిరూపించలేకపోయాడు. పైగా ఒక అధికార భైరవుడు మోపిన పదకొండు ఛార్జ్ షీట్స్ లో ఇప్పటికే తొమ్మిదింటిని కోర్టు కొట్టేసింది. ఆ క్షుద్రభైరవుడు పదవికి రాజీనామా చేసి, చంద్రబాబు పాదధూళికోసం పరితపిస్తున్నాడు.
2014 లో ఆంధ్రులు చేసిన ఒకే ఒక తప్పు ఈరోజు వారికి పెనుశాపంగా మారింది. నాలుగేళ్ల కాలంలో చిన్న హైకోర్టు భవనాన్ని నిర్మించలేని అసమర్ధుడు ఉక్కు కర్మాగారాలు, మెట్రో రైళ్లు, పోలవరాలు నిర్మిస్తాను అంటే ప్రజలు బిక్కచచ్చిపోయి చూస్తున్నారు.
అంతఃపుర శత్రువులు కుట్రచేసి రాజదంపతులను హత్యచేసి, రాజకుమారుడిని కూడా చంపడానికి ప్రయత్నిస్తే, రాజకుమారుడు తప్పించుకుని వెళ్లి, ఎక్కడో మారుమూల గ్రామంలో పెరిగి పెద్దవాడై, సైన్యాన్ని తయారు చేసి, నియంత పాలనలో ఇడుములు పడుతున్న అమాయక ప్రజలను చైతన్యవంతులను చేసి కోటను కొల్లగొట్టి నియంతను ప్రజలసమక్షంలో ఉరితీసిన అపూర్వ ఘట్టాన్ని ఈ ఏడాది నవ్యాంధ్ర నయనాలు విప్పార్చుకుని తిలకించబోతున్నది !