చంద్రన్న పాపాలు – అమరావతి శాపాలు😂😂😂

ఒక మంచి నగరం నిర్మించాలి, సమీకృత అభివృద్ధి జరగాలి అంటే విద్య అనేది పట్టుకొమ్మ. అమరావతి నగరంలో విద్యముక్కుపిండి కొరకు ప్రత్యేక పట్టణాన్ని మాస్టర్ ప్లానులో పొందుపరచి చంద్రన్న మేధావుల మనస్సు దోచుకొన్నది ముమ్మాటికీ నిజం.
సదుద్దేశం ఉన్న ఏ రాజకీయనాయకుడినా దేశంలో ప్రఖ్యాతికాంచిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, నల్సార్ లాంటి ప్రభుత్వ విద్యాసంస్థలు, సేవా దృక్పదమున్న బిర్లా, భారతీయ విద్యాభవన్, ఆంధ్ర మహిళాసభ, లొయోల లాంటి లాభాపేక్ష లేకుండా తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందిస్తున్న సంస్థలకు తక్కువ ధరకు భూములు కేటాయించి ప్రోత్సహించేవారు.
కానీ చంద్రన్న చేసిందేమిటి? ధనవంతుల పిల్లలినే లక్ష్యంగా చేసుకొని పదుల లక్షలలో డొనేషన్స్, లక్షలలో ఫీజులు ముక్కుపిండి వసూలుచేసి విద్యపేరుతో సమాజాన్ని దోసుకొని , మధ్య, దిగువతరగతివారిని అప్పులఊబిలొకి దించుతున్న విద్యావ్యవస్థపై శ్రీకారం చుట్టింది వాస్తవం. దీనికి అభివృద్ధి అనిపేరుపెట్టడం మన దౌర్భాభ్యం.
వెల్లూర్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ, గ్లోబల్ స్కూల్స్, పోదర్, రూప్ టెక్ , హైదరాబాద్ ఎడ్యుకేషన్ సొసైటీ లాంటి ప్రైవేట్ విద్యాసంస్థలకు ఎకరం 50 లక్షలకు పూర్తి హక్కులతో, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ లాంటి ప్రభుత్వ విద్యా సంస్థలకు రెట్టింపు రేటుకు లీజు పద్దతిలో భూకేటాయింపులు చేసింది వాస్తవం.
చంద్రన్న మాటలలోనే గజం 30000 పైన పలుకుచున్న భూమిని గజం 1100 చొప్పున కారుచౌకగా ముఖ్యంగా ఇతరరాష్ట్రాలకు చెందిన కార్పొరేట్ విద్యాసంస్థలకు దారాదత్తం చేయటం దేనికి సంకేతం. వందల, వేలకోట్లు చేతులు మారాయి, అస్మదీయులకు అనీ అందాయి, అందుతున్నాయి అంటే కాదనగలమా? ముఖ్యంగా విద్యలాంటి విషయంలో పాలకులకు ఉండాల్చిన పారదర్శకత లోపిస్తే సమాజానికి జరిగే నష్టాన్ని పూడ్చడం చాలా కష్టం.
ఎవరన్నా విద్యకు భూమి కేటాయిస్తే , బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్య, ఫీజుల నియంత్రణ లాంటివి విద్యావిధానంలో భాగంగా పొందుపరుస్తారు. మన చంద్రన్న విషయానికే వస్తే విఐటీకి 200 ఎకరాలు 50 లక్షల చొప్పున్న కేటాయిస్తున్నాము , ఇప్పుడు 100 ఎకరాలు ఇస్తున్నాము, 5 ఏళ్లలో 18000 విద్యార్థులు మీ లక్ష్యం, లక్ష్యం పూర్తి చేస్తే మిగిలిన 100 ఎకరాలు 50 లక్షలకే ఇస్తాం, అంటూ విచ్చలవిడి పందేరాలు. ఇప్పుడే ఎకరం 5 కోట్లు పలికే భూమి 50 లక్షలు అంటే 90% డిస్కౌంట్ తో కేటాయింపు, 5 ఏళ్ళతరువాత ఇదే రేటు అంటే ముమ్మాటికీ నిలువుదోపిడీ. పాడి ఆవు లాంటి ఆంధ్రప్రదేశ్లో 18000 స్టూడెంట్స్ ని లక్ష్యంగా పెట్టుకొని వేలకోట్లు కొల్లగొట్టడం, సామాన్య ప్రజలను విద్యపేరుతో దోపిడీ చేయడం చాలా తేలిక.
ఇలాంటి చిల్లర, చెత్త ఆలోచలలతో చంద్రన్న ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తున్నాను అంటే నమ్మడానికి ప్రజలు పిచ్చివాళ్ళేమీ కాదు. అందుకే తుక్కుగా ఓడించి శంకరగిరి మాన్యాలకు పంపించారు. అమరావతి ప్రక్షాళనకు కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా అమరావతి రైతులు సమర్ధించి చంద్రన్న చిత్ర, విచిత్ర విన్యాసాలనుండి అమరావతిని రక్షించవలసిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. అదే సమయంలో అమరావతి పేరుతో గత ప్రభుత్వం లో కొల్లగొట్టిన కోట్లరూపాయల ప్రజాధనం కక్కించవలచిన అవసరం ఉంది.
Source : బొంతు బ్రాడ్కాస్టింగ్ కంపెనీ