అక్రమాస్తులతో పట్టుబడ్డ అనకాపల్లి MINES ఏడి శివాజీ

శివాజీకి కోట్లలో ఆస్తులు ఉన్నాయి. రెండు కార్లు ఉన్నాయి.
ఓ మోటారు సైకిలు ఉంది. అయినా సాదాసీదాగా కనిపించాలనే ఉద్దేశంతో స్కూటర్ పైనే ఎక్కువగా తిరుగుతుంటారు. ఉదయం డొక్కు స్కూటర్ లో రైల్వే స్టేషన్ కు వెళ్లి అక్కడ పార్కింగ్ లో పెట్టి రైల్లో అనకాపల్లి వెళ్తారు.
అనకాపల్లి రైల్వే స్టేషన్ లో దిగ గానే కారు సిద్ధంగా ఉంచుతారు. ఈయన 26 సంవత్సరాల క్రితం సాంకేతిక సహాయకుడిగా భూగర్భ గనుల శాఖ లో చేరారు.
ప్రస్తుతం సహాయక సంచాలకుని హోదాలో పని చేస్తున్నారు.
పదోన్నతుల తో పాటు ఆదాయానికి మించిన ఆస్తులు పెంచుకుంటూ వచ్చారు. అవినీతి అక్రమాల్లో ఆరితేరిపోయారు. ఉన్నత అధికారులు నేతల అండదండలతో ఆదాయం వచ్చినచొటేపోస్టింగ్లు తెచ్చుకుని అక్రమ వసూళ్లు లో చెలరేగిపోయారు.
అనకాపల్లి minds ఎడి గుండు శివాజీ తాజాగా ఆదాయ కి మించిన ఆస్తుల కేసులో అనీషా కు చిక్కారు.
అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం తెల్లవారు 6:30 గంటలకు ఆరు బృందాలు ఎంవిపి కాలనీ సెక్టర్ 3 లోని, శివాజీ ఇంటితో పాటు ఆరు చోట్ల సోదాలు నిర్వహించారు.
కళ్ళు బైర్లు కమ్మేలా బంగారు, నగదు నిలవలు ఆస్తులకు సంబంధించి దస్తావేజులు బయటపడ్డాయి.
ప్రాథమికంగా 2 . 50 కోట్ల మేర ఆదాయనికి మించి ఆస్తులను కూడబేటీనటు అంచనా వేశారు.
ఇంకా సోదాలు నిర్వహిస్తామని ప్రస్తుతం నివాసం ఉంటూన ఇల్లు ,భోగాపురంలో నిర్మిస్తున్న ఇంటి విలువను మధిస్తే ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఇంట్లో ఉన్న ఆస్తి పత్రాలతో పాటు పది లక్షల నగదు, 440 గ్రాముల బంగారం, 3.3 కేజీల వెండి వస్తువులు.
బ్యాంకు లాకర్ లో ఉన్న సుమారు 73 . 50 లక్షలతో పాటు 13 50 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
శివాజీ ని అరెస్ట్ చేసి శుక్రవారం అనిశా ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తామని అనిశా డిఎస్పి ప్రసాద్ తెలిపారు.