అమరావతి లో ఎన్ని ఎకరాలు ఉన్నాయో?

అమరావతి కోసం రంగం లోకి దిగిన ఆధ్యాత్మికవేత్త లు గొట్టిపాటి సత్యవాణి(చౌదరి), కొండవీటి జ్యోతిర్మయి(చౌదరి)
అమరావతి లో ఎన్ని ఎకరాలు ఉన్నాయో? – ఆధ్యాత్మికం ముసుగులో సత్యవాణి భూ ఆక్రమణల దందా.

  • ఇప్పటిదాకా కబ్జా.. 520 ఎకరాలకుపైగానే.
  • దీప్తిశ్రీ నగర్‌ను బుక్కపెట్టిన సత్యవాణి, అట్లూరి సుబ్బారావు.
  • పార్క్, స్కూల్, కమర్షియల్ స్థలాల్లోనూ అక్రమ లే అవుట్లు.
  • ఆర్‌టీఐ సమాచారంతో బట్టబయలైన బండారం.
  • శ్రీ శివబాలయోగి మహరాజ్ ట్రస్టు పేరుతో దేవుళ్లు, హుండీలు.
  • సత్యవాణి ఆధీనంలో ఉన్న స్థలాలన్నీ సర్కారువే: శేరిలింగంపల్లి తహశీల్దార్ వెల్లడి.

హైదరాబాద్ సెప్టెంబర్ 16 (టీ మీడియా): నోరు తెరిస్తే.. ఆధ్యాత్మికం, కాలు కదిపితే కబ్జా ఆమె స్టైల్. శివ.. శివ అంటూనే గుడితో సహా లింగాన్ని మింగే ఘనురాలు. సీమాంధ్ర నుంచి హైదరాబాద్‌కు వచ్చి వందల ఎకరాల భూమిని సంపాదించడం ఎంత వీజీనో శ్రీ శివ బాలయోగి మహరాజ్ ట్రస్టు ఓనర్ గొట్టిపాటి సత్యవాణిని అడిగితే తెలుస్తుంది. సత్యవాణి సమైక్యసభలో చెప్పిన సుద్దులకు.. అధ్యాత్మికం మాటున నిర్వహించే దందాలకు ఏమాత్రం సంబంధంలేదని ఆమె గురించి కొంత తెలుసుకున్నా అర్థమైపోతుంది. ధార్మిక క్షేత్రం మాటున సత్యవాణి అక్రమించిన సర్కారు స్థలం 520ఎకరాలపైమా సమాచారం. మియాపూర్‌లో సత్యవాణి ఆక్రమించిన స్థలంలో ఒక చెరువు ఉండేదని.. ఇందు లో గ్రామస్థులు బతుకమ్మలు కూడా వేసేవారని స్థానికులు చెబుతున్నారు.

సత్యవాణి ప్రవేశం తర్వాత ఆ స్థలంలో మియాపూర్‌వాసుపూవ్వరూ అడుగుపెట్టే పరిస్థితి లేదని.. వనభోజనాలు నిర్వహించుకునేందుకు సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందినవారినే అనుమతిస్తారని వాపోతున్నారు. సత్యవాణి శిష్యురాలు సరళారాణి ఈ విషయాన్ని ‘టీ మీడియా-టీ న్యూస్’కు వెల్లడించారు. ఈ స్థలంలో ఏర్పాటుచేసిన శ్రీ శివ బాలయోగి మహరాజ్ ట్రస్టు ప్రాంగణంలో శివాలయం, సాయిబాబా మందిరం, సరస్వతి దేవాలయం, విజయదుర్గాదేవీ మందిరాలు నిర్మించారు. దేవాలయాల్లో హుండీలు ఏర్పాటు చేసి భారీగా డబ్బులు గుంజడమే లక్ష్యంగా ఆమె ట్రస్టు రోజువారీ కార్యకలాపాలు సాగుతాయనే విమర్శలున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *