అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ రాబోదు……. తేల్చి చెప్పేసిన నాగార్జున.

నందమూరి తారకరామారావు గారి బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం విధితమే. అందులో తొలి భాగం NTR- కథానాయకుడు గా జనం ముందుకు వచ్చింది.
అలాగే ఈ సినిమా రిజల్ట్ ను జనాల తో పాటు నాగార్జున కూడా చూశారు. వెంటనే అప్రమత్తమై తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారి బయోపిక్ తీసే ఉద్దేశం తమకు లేదని ప్రకటించారు.
సంక్రాంతి బరిలో వచ్చిన NTR- కథానాయకుడు పూర్తిగా డిజాస్టర్ అయ్యింది.
ఈ సినిమా తీస్తున్న సమయంలోనే ANR బయోపిక్ కూడా చేస్తే బాగుంటుందని చర్చ కూడా జరిగింది.
ముఖ్యంగా NTR కోణంలో ANR ని చూపించడం వలన ANR బయోపిక్ తీసి దానిలో ANR కోణంలో NTR ను చూపించాలని డిమాండ్లు వచ్చాయి.
ఈ అనుమానాలు అన్నింటికీ సమాధానం ఇస్తూ, తన తండ్రి బయోపిక్ ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.

“ఆయన నటించిన సినిమాలన్నీ రీమేక్ చేయడానికి భయపడే మేము ఏకంగా బయోపిక్ తీయాలని అనుకోవడం లేదు” అని స్పష్టం చేశారు.
పైగా అక్కినేని నాగేశ్వర రావు గారికి ఘన నివాళి ఇవ్వాల్సిన బయోపిక్ ఒకవేళ ఫ్లాప్ అయితే, తాము తట్టుకోలేమని పరోక్షంగా NTR బయోపిక్ పై సెటైర్ వేశారు.