అగ్రిగోల్డ్ ఆస్తులు పై మంత్రుల కన్ను

AgriGold chairman, MD produced

AgriGold chairman, MD produced

వైసీపీ ప్రభుత్వం రాగానే బాధితులకు న్యాయం చేస్తాం : వైసీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయ్ ప్రసాద్ అగ్రిగోల్డ్ సంస్ధకు చెందిన ఆస్తులు పై రాష్ట్ర మంత్రుల కన్ను పడిందని , కబ్జా చేయడానికి కుట్ర చేస్తున్నారని వైసీపీ నగర అద్యక్షుడు మళ్ల విజయ్ ప్రసాద్ ఆరోపించారు.

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం అగ్రిగోల్డ్ బాధితుల నిరసన కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కి అగ్రిగోల్డ్ కు చెందిన 1153 కోట్ల విలువైన స్థిరాస్తులను కాజేయడానికి మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు ప్రయత్నిస్తామన్నారు. ప్రభుత్వం అసమర్ధత వల్లే ఇంత జాప్యం జరిగిందన్నారు. గత నాలుగేళ్లుగా కోర్టు అటాచ్మెంట్కు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించ లేదన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులైన 30 లక్షల మందికి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎలమంచిలి కి చెందిన అగ్రిగోల్డ్ బాధితులు తాతబాబు గుండెపోటుతో చనిపోవడంతో సభా ప్రాంగణం వద్ద ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు తైనాల విజయ్ కుమార్, సమన్వయకర్తలు కెకెరాజు , వంశీకృష్ణ శ్రీనివాస్ డాక్టర్ పి వి రమణమూర్తి, తిప్పల నాగిరెడ్డి, అక్రమాన్ని విజయనిర్మల వైసిపి నగర మహిళా అధ్యక్షురాలు గరికిన గౌరి , వెంకట్ లక్ష్మి, యువ శ్రీ, సనపల రవీంద్ర భరత్ , అధిక సంఖ్యలో అగ్రిగోల్డ్ బాధితుల పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *