శుక్రవారం ఉదయం మాజీ మంత్రి అచ్చెన్నాయుడుశ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు… పార్టీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది…జగన్‌ని అరెస్ట్ చేసినప్పుడు టీడీపీ, చంద్రబాబు సంబరాలు చేసుకున్నారని ఆసక్తికర ప్రకటనలు…..


విజయవాడకు తరలిస్తున్నారు. అయితే అచ్చెన్నకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని.. కనీసం మందులు వేసుకోనివ్వకుండా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయన ఆరోగ్యం కూడా బాలేదంటున్నారు.

1.Atchannaidu అరెస్ట్‌పై స్పందించిన జనసేన.. ఆసక్తికర ప్రకటన

అవినీతి ఏ రూపంలో ఉన్నా దానికి బాధ్యులు ఎంతటి వారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని.. అయితే అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు శ్రీ అచ్చెన్నాయుడు గారిని అరెస్టు చేయడం సందేహాలకు తావిస్తోంది అన్నారు.

ఆ పార్టీ తరపున రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటన విడుదల చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు అవినీతికి పాల్పడినందుకా? లేదా రాజకీయ కక్ష సాధింపు కోసమా అనే విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలి అన్నారు.

అలాగే ఒక శాసనసభ్యుడిని అరెస్ట్‌ చేసే ముందు రాజ్యాంగ నియమ నిబంధనలను పాటించవలసిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు మనోహర్.

అచ్చెన్నాయుడు గారి అరెస్టులో అవి లోపించినట్లు కనిపిస్తున్నాయని.. ఈ.ఎస్‌.ఐ.లో జరిగిన అవకతవకలతోపాటు ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని జనసేన డిమాండ్‌ చేస్తోంది అన్నారు.

2.ఇది ట్రైలరే.. ముందుంది అసలు సినిమా.. టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈఎస్‌ఐ కుంభకోణంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రకంపణలు రేపుతోంది.

అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు.

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ కేవలం ట్రైలర్ మాత్రమే అని.. అసలు సినిమా ముందుందని రోజా వ్యాఖ్యానించారు.

తప్పు చేశారని రుజువైంది కాబట్టే అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని ఆమె తెలిపారు. ఆధారాలతో అరెస్ట్ చేస్తే కిడ్నాప్ చేశారని చంద్రబాబు అంటున్నారని.. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదని ఎద్దేవా చేశారు.

తాము ఎవరిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు.

గత టీడీపీ ప్రభుత్వ హాయాంలో అవినీతి జరిగినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి లెక్కలతో సహా నిరూపించారని పేర్కొన్నారు.

అలాగే తమ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగితే నిరూపించాలని గతంలోనే లోకేష్ ఓ ప్రెస్ మీట్‌లో చెప్పారని, ఇప్పుడు అదే చేస్తున్నామని వ్యాఖ్యానించారు.

రాజధాని భూముల్లో అక్రమాలు, ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుకల్లో జరిగిన అవకతవకలను కచ్చితంగా బయటికి తీసుకొస్తామని స్పష్టం చేశారు.

తప్పు చేసిన వ్యక్తి బీసీ అయినా, ఓసీ అయినా, ఎస్సీ అయినా.. ఎవరైనా తప్పకుండా జైలుకు పంపిస్తామని ఎమ్మెల్యే రోజా వెల్లడించారు.

3.అప్పుడు సంబరాలు చేసుకున్నారుగా..
అరెస్ట్‌పై హోంమంత్రి సుచరిత స్పందించారు.

అచ్చెన్నకు నోటీసులు ఇచ్చి ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారన్నారు. వైద్య పరికరాల కొనుగోళ్లలోనూ అవినీతి జరిగిందని.. అరెస్టు విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై హోంమంత్రి సుచరిత స్పందించారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని.. అచ్చెన్నకు నోటీసులు ఇచ్చి ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారన్నారు.

వైద్య పరికరాల కొనుగోళ్లలోనూ అవినీతి జరిగిందని.. అరెస్టు విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు.

అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవద్దా అంటూ ప్రశ్నించారు. దొంగ బిల్లులు పెట్టి డబ్బుల్ని స్వాహా చేశారన్నారు.

జగన్‌ని అరెస్ట్ చేసినప్పుడు టీడీపీ, చంద్రబాబు సంబరాలు చేసుకున్నారని.. అలాంటి వారు ఇప్పుడెలా మాట్లాడతారని ప్రశ్నించారు హోంమంత్రి. చంద్రబాబు చెప్పినట్లుగా అచ్చెన్నాయుడిని లాక్కుని వెళ్లలేదని.. మామూలుగానే తీసుకెళ్లారన్నారు.

కేంద్రం డబ్బైనా, రాష్ట్ర ప్రభుత్వం డబ్బైనా చర్యలు తీసుకోవాలన్నారు. అచ్చెన్నాయుడు బలవంతంగా లాక్కెళ్లరనడం సరికాదని.. వారి కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణల్ని ఆమె కొట్టిపారేశారు.

శుక్రవారం ఉదయం మాజీ మంత్రి అచ్చెన్నాయుడ్ని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు. అయితే అచ్చెన్నకు ముందస్తు

నోటీసులు ఇవ్వకుండా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని.. కనీసం మందులు వేసుకోనివ్వకుండా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయన ఆరోగ్యం కూడా బాలేదంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *