YSR ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో ఉద్యోగాలు…

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1.అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా రెజ్యూమ్ పంపాలి 2.ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపికలు
3.జులై 9, 10 తేదీల్లో ఇంటర్వ్యూల నిర్వహణ

గుంటూరులోని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టుల వారీగా అర్హతలు నిర్ణయించారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.

వివ‌రాలు…

✪ పోస్టుల సంఖ్య: 37

1) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (నాన్ టెక్నికల్): 03 పోస్టులు
అర్హతలు, అనుభవం..

✦ డిప్యూటేషన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అసిస్టెంట్ డైరెక్టర్ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
హోదాలో రాష్ట్ర/కేంద్ర విభాగ సర్వీసుల్లో కనీసం 3 సంవత్పరాలు పనిచేసి ఉండాలి.

✦ఇక కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేయదలచుకున్నవారు రాష్ట్ర/కేంద్ర విభాగ సర్వీసుల్లో అసిస్టెంట్ డైరెక్టర్ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హోదాలో పనిచేసి రిటైర్డ్ ఉద్యోగులై ఉండాలి.

✦ ఆరోగ్యసంస్థలు/ పథకాలకు సంబంథించి కనీసం 2 -3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

✦ టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రావీణ్యం ఉండాలి.
జీతం: రూ.38,000.

2) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (టెక్నికల్): 02 పోస్టులు

అర్హత‌లు..
✦ ఫారిన్ సర్వీస్ డిప్యూటేషన్ అభ్యర్థులు రాష్ట్ర/ కేంద్ర/ ప్రభుత్వరంగ విభాగాల్లో డైరెక్టర్/అడిషనల్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తూ ఉండాలి.

✦ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయదలచుకున్నవారు డైరెక్టర్/అడిషనల్ డైరెక్టర్ హోదాలో పనిచేసి రిటైర్డ్ అయి ఉండాలి.

✦ ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఎంఎస్/ ఎండీ లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం: 10 – 15 సంవత్సరాలు.
జీతం: రూ.87,130.

3) జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (టెక్నికల్): 07 పోస్టులు
అర్హతలు..

✦ ఫారిన్ సర్వీస్ డిప్యూటేషన్ అభ్యర్థులు రాష్ట్ర/ కేంద్ర/ ప్రభుత్వరంగ విభాగాల్లో డైరెక్టర్/అడిషనల్ డైరెక్టర్ హోదాలో సివిల్ సర్జన్‌గా పనిచేస్తూ ఉండాలి.

✦ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయదలచుకున్నవారు డైరెక్టర్/అడిషనల్ డైరెక్టర్ హోదాలో సివిల్ సర్జన్‌గా పనిచేసి రిటైర్డ్
అయి ఉండాలి.
✦ ఎంబీబీఎస్‌ అర్హత ఉండాలి.
✦ 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
✦ బీడీఎస్ అర్హత ఉన్నవారికి ఒక పోస్టు కేటాయించారు.
జీతం: రూ.50,050. ఇతర భత్యాలు అదనం.

4) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (టెక్నికల్): 20 పోస్టులు
అర్హతలు..
✦ ఫారిన్ సర్వీస్ డిప్యూటేషన్ అభ్యర్థులు రాష్ట్ర/ కేంద్ర/ ప్రభుత్వరంగ విభాగాల్లో డైరెక్టర్/అడిషనల్ డైరెక్టర్ హోదాలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తూ ఉండాలి.

✦ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయదలచుకున్నవారు డైరెక్టర్/అడిషనల్ డైరెక్టర్ హోదాలో సివిల్ సర్జన్‌గా పనిచేసి రిటైర్డ్
అయి ఉండాలి.
✦ ఎంబీబీఎస్‌/ బీడీఎస్ డిగ్రీ అర్హత ఉండాలి.
✦ 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
✦ నిబంధనల ప్రకారం ఇతర అర్హతలు ఉండాలి.
✦ బీడీఎస్ అర్హత ఉన్నవారికి ఒక పోస్టు కేటాయించారు.
జీతం: రూ.40,270.

5) డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్: 04 పోస్టులు (కర్నూలు, కడప, తూర్పుగోదావరి, రంపచోడవరం)
అర్హతలు..

✦ ఫారిన్ సర్వీస్ డిప్యూటేషన్ అభ్యర్థులు కేంద్ర/ రాష్ట్ర సర్వీసుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్/ డిప్యూటీ సివిల్ సర్జన్/ ఎంబీబీఎస్ అర్హతతో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఉండాలి.

✦ కాంట్రాక్ట్ అభ్యర్థులు ఎంహెచ్‌ఏ/ ఎంఫిల్ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్) అర్హత కలిగి ఉండాలి.

అనుభవం: 2 – 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్‌తోపాటు టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లిష్, తెలుగు ప్రావీణ్యం తప్పనిసరి.
జీతం: రూ.45,000.

6) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (అడ్మిన్ – నాన్ టెక్నికల్): 01 పోస్టు
అర్హతలు..

✦ ఫారిన్ సర్వీస్ డిప్యూటేషన్ అభ్యర్థులు కేంద్ర/ రాష్ట్ర సర్వీసుల్లో డైరెక్టర్/ అడిషనల్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తూ ఉండాలి.

✦ కాంట్రాక్ట్ అభ్యర్థులు కేంద్ర/ రాష్ట్ర సర్వీసుల్లో డైరెక్టర్/ అడిషనల్ డైరెక్టర్ హోదాలో పనిచేసి రిటైర్డ్ అయి ఉండాలి.
జీతం: రూ.87,130.
వయసు: అన్ని పోస్టులకు 65 సంవత్సరాలలోపు ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
ఎంపిక‌ విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: జులై 9, 10 తేదీల్లో.
సమయం: ఉ.10.30 గం.

ఇంటర్వ్యూ వేదిక‌: Dr.YSR Aarogyasri Health Care Trust, D.No. 25-16-116/B, Chuttugunta,Behind Gautam’s Hero Showroom,Guntur – 522004.Andhra Pradesh, India.

ఎగ్జిక్యూటివ్/ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (టెక్నికల్/ నాన్ టెక్నికల్)- నోటిఫికేషన్
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (టెక్నికల్) – నోటిఫికేషన్
డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ – నోటిఫికేషన్
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (అడ్మిన్-నాన్ టెక్నికల్)-నోటిఫికేషన్

ఈమెయిల్:
[email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *