108 Vehicles Launch:ఈ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో జెండా ఊపి ప్రారంభించారు.

108 Vehicles Launch: ప్రజారోగ్యానికి జగన్ సర్కార్ భరోసా.. 108, 104 వాహనాలు ప్రారంభం

ఈ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడ నుంచి అంబులెన్సులు కుయ్, కుయ్ అంటూ రాష్ట్ర నలుమూలలకు తరలి వెళ్లాయి.

ఏపీలో ప్రజారోగ్యం కోసం జగన్ సర్కార్ కీలక అడుగు ముందుకు వేసింది. ఆరోగ్య శ్రీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు-నేడుకు తోడు కొత్తగా 108, 104 అంబులెన్సులు అందుబాటులోకి తీసుకొచ్చింది.

బుధవారం ఈ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో జెండా ఊపి ప్రారంభించారు.

విజయవాడ నుంచి అంబులెన్సులు కుయ్, కుయ్ అంటూ రాష్ట్ర నలుమూలలకు తరలి వెళ్లాయి. ఈ వాహనాల్లో 676 వాహనాలు 104 కాగా.. మరో 412 వాహనాలు 108లు.

ప్రభుత్వం కొత్తగా అత్యాధునిక వైద్య సేవలందించే ఈ అంబులెన్సులలో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్‌ఎస్‌)కు సంబంధించినవి.. 104 అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టు (ఏఎల్‌ఎస్‌)తో తీర్చిదిద్దారు.

మరో 26 అంబులెన్సులను చిన్నారులకు (నియో నేటల్‌) వైద్య సేవలందించేలా తయారు చేశారు. 104 సర్వీసుల్లో సమూల మార్పులు చేసిన ప్రభుత్వం, హెల్త్‌ కేర్‌ డెలివరీకి అవకాశం ఉంటుంది.

ఆ స్థాయిలో మొబైల్‌ మెడికల్‌ యూనిట్ల(ఎంఎంయూ)ను తీర్చిదిద్దారు. మారుమూల ప్రాంతాల్లో కూడా అత్యాధునిక వైద్య సేవలందించే విధంగా, అన్ని వసతులతో ఎంఎంయూలను సిద్ధం చేశారు.

ప్రతి మండల కేంద్రంలో ఒక సర్వీసు అందుబాటులో ఉండే విధంగా ఒకేసారి వాహనాలను సిద్ధం చేశారు.

జూలై 1 నుంచి మరికొన్ని 108, 104 నూతన వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 203.47 కోట్లతో అంబులెన్స్ వాహనాలు కొనుగోలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.

ప్రతి మండలంలో ఎక్కడైనా ప్రమాదం జరిగితే అక్కడికి 20 నిమిషాల్లో చేరేలా ప్రభుత్వం రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. పట్టణ ప్రాంతాల్లో అయితే ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ (గిరిజన) ప్రాంతాల్లో అయితే 25 నిమిషాల్లో అంబులెన్స్‌లు చేరే విధంగా ప్లాన్ చేశారు.ప్రతి అంబులెన్స్‌ను ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ (ఈఆర్‌సీ)తో అనుసంధానం చేయడం ద్వారా, ఫోన్‌ చేసిన వారిని వేగంగా ట్రాక్‌ చేసే వీలు కలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *