‘పెద్ద’ నటి ఇంట్లో ‘బాల’ కార్మికురాలు

సినీ నటి భానుప్రియ పై ప్రభావతి అనే ఓ మహిళ సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. భానుప్రియ వద్ద తన 14 ఏళ్ల కుమార్తె సంధ్యను పనికి పెట్టినట్లు ప్రభావతి తెలిపింది.

ఏడాదిన్నర క్రితం సామర్లకోట పెంద్రవాడకు చెందిన సంధ్యను భానుప్రియ ఇంట్లో పనికి చేర్చినట్లు ప్రభావతి తెలిపింది.

అప్పటి నుండి తన కుమార్తెను వేధిస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొంది.

అంతేగాక భానుప్రియ సోదరుడు తన కుమార్తె పై లైంగిక దాడి చేసినట్లు కూడా ఆరోపించింది.

ఇంటికి పంపమని అడిగితే పంపకుండా దొంగతనం కేసు పెడతామని బెదిరిస్తున్నారు అని పేర్కొంది.

10 లక్షలు ఇస్తేనే తన కుమార్తెను తిరిగి పంపుతామని అన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది.

ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు చెన్నై పోలీసులకు చైల్డ్ లైన్ ద్వారా కేసును పంపారు.

బాధితురాలు మీడియాతో వివరిస్తూ… తనకు భర్త లేడని, ఇద్దరు కుమార్తెలను చెప్పింది. పెద్దమ్మాయి పెళ్లి చేయగా, రెండో అమ్మాయి ని తెలిసిన వాళ్ల ద్వారా భానుప్రియ ఇంట్లో పనికి పెట్టినట్లు చెప్పింది.

పండగ తర్వాత తన కుమార్తెను చూడడానికి వెళ్తే, ఆమెను చూపించకుండా మూడు గంటల పాటు కాలయాపన చేశారని వాపోయింది.

భానుప్రియ సోదరుడు తన కుమార్తెను లైంగికంగా వేధిస్తున్నారని చెప్పింది.

తన కుమార్తెను తనతోపాటు తీసుకెళ్తానని అనగా దొంగతనం కేసు పెడతామని బెదిరించి, తనపై కూడా చెయ్యి చేసుకున్నారని వాపోయింది.

10 లక్షలు ఇస్తేనే కుమార్తెను ఇస్తామన్నారని అంది. భాష రాని ప్రాంతంలో ఉండి, ఏం చేయాలో తోచక ఇక్కడకు వచ్చి కేసు పెట్టినట్లు ప్రభావతి చెప్పింది.

ఎలాగైనా తన కుమార్తెను తనకు తెచ్చి ఇచ్చి తనకు న్యాయం చేయాలని ప్రభావతి మీడియా ద్వారా కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *