విభజనాంధ్రప్రదేశ్ – “రాజధాని” ని చంద్రబాబు ఏకపక్ష నిర్ణయం

ఎవరు అవునన్నా కాదన్నా – విభజనాంధ్రప్రదేశ్ ” రాజధాని ” విషయంలో చంద్రబాబు అవగాహనలేమి … రాష్ట్రమంతా పర్యటించి అందరి అభిప్రాయాలూ తీసుకున్న శ్రీకృష్ణ కమిటీ సూచనల్ని పరిగణించలేని లెక్కనేనితనం … మేధావులు + ప్రతిపక్షాన్ని సైతం పక్కకు పెట్టి నిరంకుశత్వ ఏకపక్ష నిర్ణయం వల్లనే రాజధాని నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యం కాకపోయింది అనేది పచ్చి వాస్తవం !


రాజధాని భూముల్లో కుంభకోణం … బినామీ యవ్వార మాయలు … రైతు భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం … చేతిలో చిల్లిగవ్వ లేకున్నా అదిగో ” ప్రపంచ రాజధాని ” అంటూ బీరాలు పలకడం … రాజధానిని అడ్డం పెట్టుకొని ఎక్కిన విమానం దిగకుండా దేశాలు తిరుగుతూ ; ఆయాదేశాల ప్రాతినిథ్యం ఉంటుందంటూ ఫోజులు కొట్టి, గబ్బు రాతలతో మీడియా మేనేజ్ మెంట్ చేసుకుంటూ… ఉన్న ఐదేళ్లు శాశ్వత రాజధాని నిర్మాణ దిశగా అడుగులేయకుండా అధిక ప్రజాధనాన్ని వాడి తాత్కాలిక నిర్మాణాలతోనే ” అహో ఓహో ” అంటూ స్వీయ భజన కీర్తనలతో తమ కాళ్లకు తామే మొక్కుకోవడం … రాజధాని ముఖచిత్రాన్ని కేవలం గ్రాఫిక్స్ తోనే ” హంబక్ ” చేయడం … ఒక సామాజిక వర్గం వారికి మేళ్లు చేసేలా రాజధానిలో ప్రతి నిర్ణయం ఉండడం … రాజధానికి ” నీళ్లు ” అనే ఒకే ఒక్క అంశాన్ని అడ్డం పెట్టుకొని దాని చుట్టూ నిర్ణయం తీసుకోవడంతోనే ఇప్పటికీ అమరావతి ఓ భ్రమరావతిగా నిర్జీవంగా ఒక్క ఇటుక కూడా పడకుండా ఉండిపోయింది !

ప్రజలకు ఇవ్వన్నీ తెలిసినా కూడా సర్దుకుపోయారు … కానీ; ఇన్నాళ్లు పాజిటివ్ అంశంగా చేసుకొని చెప్పిన నీళ్ళే వరద నీళ్ళ రూపంలో అమరావతిని కొంప ముంచేసింది … అది ” సేఫెస్ట్ ప్లేస్ ” కాదని ! … చంద్రబాబుకు అనుభవమున్నా పెద్ద తప్పు చేశాడని !! … ప్రకృతిని ఎదిరించేలా ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని !!! ….. ఆయన అనుభవాన్ని అంతా వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకున్నాడని … ఒకే సామాజిక వర్గ కోణ ప్రయోజనంలోనే నిర్ణయాలు చేశాడని… పాలనను వికేంద్రీకరించకుండా కేవలం ఒక సామాజిక వర్గ మేళ్లు కోసమే అమరావతిలోని కేంద్రీకరించాడని … అందుకే గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంగా రాజధాని పరిసర ప్రాంతం భేదం లేకుండా తెలుగుదేశం పార్టీని చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అథఃపాతాళం తొక్కేలా తీర్పునిచ్చారు.

చివరికి రాజధాని ప్రాంతంలో పోటీ చేసిన తన కుమారుడు మూడు శాఖలకు మంత్రై , అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రలోభాలు పెట్టినా, విచ్చలవిడిగా డబ్బులు గుమ్మరించినా మొట్టమొదటిసారే ప్రతిష్టాత్మకంగా గెలిపించలేనంత అత్యంత దారుణాతి దారుణంగా.

అయినా ఇప్పటివరకు చూస్తే రాజధాని అమరావతిలోనే ఉండాలంటున్న మేధావులంతా బాబు భక్త జనాలే ! ఆడమంటే ఆడుతున్న పచ్చ మీడియాలే ! ఏదేమైనా ; సరైన సమయంలోనే కృష్ణమ్మ – గోదావరమ్మలు కలసి ఉగ్ర రూపంలో రాజధాని నిర్ణయం సరైనది కాదని నిరూపించాయి ! ….. ” ప్రపంచ రాజధాని ” కాకుండా ” ప్రజల రాజధాని ”గా మార్చుకోవడానికి మరో గొప్ప అవకాశాన్ని ప్రకృతి అందించింది అని మనస్ఫూర్తిగా భావిస్తున్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *