తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో దొంగలు పడ్డారు

కలియుగ దైవమైన తిరుమల శ్రీనివాసులు. అన్నయ్య గోవిందరాజస్వామి ఆలయంలో శనివారం దొంగలు పడ్డారు.
తిరుపతి నడిబొడ్డున కొలువైన ఈ ఆలయంలో ఉత్సవ మూర్తుల విగ్రహాలను మూడు కిరీటాలు శనివారం సాయంత్రం మాయమైనట్టు గుర్తించారు.
విలువైన వజ్రాలు పొదిగిన కిరీటాలు కనిపించడం లేదని తెలుస్తోంది. ఈ పరిణామం తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాల్లో కలకలం రేపింది.

గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులకు ప్రతిరోజు సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహిస్తారు. ప్రత్యేక రోజుల్లో స్వామి వారితో పాటు అమ్మవార్లను అలంకరించి ప్రత్యేక వాహనాల్లో ఊరేగిస్తారు.
వారికి అలంకరించేందుకు పూరతనవజ్రాభరణాల తో కూడిన ఆరు కిరీటాలు ఉన్నాయి. వాటిని సాధారణ రోజుల్లో మూలవిరాట్టుకు సమీపంలోని ఉంచుతారు. ఒంటి పై ఒక జత తో పాటు, మరో జత కిరీటాలు విడిగా ఉంటాయి.
శనివారం ఉదయం సుప్రభాత సేవ సమయంలో కనిపించే. ఉత్సవమూర్తుల కిరీటాలు తర్వాత మాయమైనట్టు సమాచారం.
దీన్ని తితిదే విజిలెన్స్ కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ గుర్తించి తమ అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిసింది.
విచారణలో భాగంగా అధికారులు కిరీటాలను పరిరక్షించే సిబ్బందిని అర్చకులను ఒక్కొక్కరిగా ఆలయనికి పిలిపించారు.
ఆలయం మూసివేత అనంతరం రాత్రి 9 గంటల ప్రాంతంలోను అర్బన్ ఎస్పీ అనుభ రాజన్టీ, టీడీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి గోపీనాథ్ జెట్టి తో పాటు తితిదే జేఈవో పోలా భాస్కర్. గోవిందరాజస్వామి ఆలయనికిచేరుకున్నారు.
అర్చకులు సిబ్బందిని ఆరా తీశారు.
కిరీటాలు 3 కనిపించడం లేదని ప్రాథమికంగా గుర్తించారు. విలువైన ఆభరణాలు ఎప్పుడు మాయమయ్యే ఇతర విచారణ అంశాలను అధికారులు వెల్లడించలేదు.